వినూత్నంగా ముంబై సంబరాలు: డిన్నర్‌లో మెరిసిన అమితాబ్, సచిన్
హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పూణెపై ఒక పరుగు తేడాతో విజయం సాధించి ముంబై చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
దీంతో ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుని ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో ముంబై ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అనంతరం సోమవారం నగరంలోని శ్రీసిద్ధి వినాయక గణపతి ఆలయానికి ట్రోఫీతో వెళ్లి పూజలు నిర్వహించి, స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఆ తర్వాత సోమవారం సాయంత్రం ముంబై ఇండియన్స్ విజయంలో కీలకపాత్ర పోషించిన ప్రతి ఒక్కరికీ డిన్నర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, నీతా అంబానీ, ముఖేశ్ అంబానీ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముంబై ఆటగాళ్లు ట్రోఫీని పట్టుకుని సచిన్ టెండూల్కర్‌తో పాటు అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. పలువురు క్రికెటర్లు అమితాబ్‌తో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ముంబై ఇండియన్స్ మూడుసార్లు గెలిచిన టైటిళ్లను ప్రదర్శనలో ఉంచారు.
అమితాబ్‌తో సచిన్ టెండూల్కర్
ఒకేచోట ఇద్దరు లెజెండ్లు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్. సచిన్‌ను చూడగానే బిగ్ బి హత్తుకున్నాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో పూణెపై విజయం సాధించిన ముంబై ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ విజేతగా నిలిచింది.
అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఫొటోలకు ఫోజులు
ముంబై ఆటగాళ్లు ట్రోఫీని పట్టుకుని సచిన్ టెండూల్కర్‌తో పాటు అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. పలువురు క్రికెటర్లు అమితాబ్‌తో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.
సచిన్‌ను హత్తుకున్న అమితాబ్
ముంబై ఇండియన్స్ విజయంలో కీలకపాత్ర పోషించిన ప్రతి ఒక్కరికీ డిన్నర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, నీతా అంబానీ, ముఖేశ్ అంబానీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సచిన్‌ను చూడగానే అమితాబ్ హత్తుకున్నారు.
హోటల్‌లో ముంబై ఇండియన్స్ సంబరాలు
ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ విజేతగా అవతరించిన ముంబై ఇండియన్స్ హోటల్‌కు వచ్చిన తర్వాత సంబరాల్లో మునిగితేలారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడాడు.
డ్యాన్స్ చేసిన ఆటగాళ్లు
ముచ్చటగా మూడోసారి ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డిన్నర్ కార్యక్రమంలో ముంబై ఆటగాళ్లకు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆటగాళ్లు డ్యాన్స్ చేశారు.
జోస్ బట్లర్ వినూత్నంగా
ఐపీఎల్ ఫైనల్‌లో ముంబై ఇండియన్స్ గెలుపొందడంతో ఆ జట్టు ఆటగాడు జోస్ బట్లర్ ఆనందం కట్టలు తెగింది. దీంతో వినూత్నంగా సంబరాన్ని చేసుకున్నాడు. అంతేకాదు తన సంబరాలను ఇనిస్టాగ్రామ్‌లో పెట్టి అభిమానులతో పంచుకున్నాడు. ఆదివారం జరిగిన పైనల్ మ్యాచ్‌లో పూణెపై ఒక పరుగు తేడాతో ముంబై విజయం సాధించింది. దీంతో జోస్ బట్లర్ ఆనందంలో కట్టుకున్న టవల్‌ను విప్సేసి.. నగ్నంగా గంతులు వేశాడు.
పార్ధీవ్ పటేల్
ట్రోఫీని ముద్దాడుతున్న పార్దీవ్ పటేల్.
ట్రోఫీతో ఫోటోలకు ఫోజులిచ్చిన బుమ్రా
ట్రోఫీతో ఫోటోలకు ఫోజులిచ్చిన ముంబై ఇండియన్స్ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications