ఆ ఫోన్‌కాల్ వల్లే విధ్వంసకర ఇన్నింగ్స్: డివిలియర్స్ (ఫోటోలు)
హైదరాబాద్: ఒక ఫోన్‌కాల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ను ఓ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడేలా చేసింది. సోమవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ 10వ సీజన్‌లో అరంగేట్రం చేసిన ఏబీ డివిలియర్స్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.
ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్ 46 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్సుల సాయంతో 89 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. నిజానికి ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ నుంచే ఏబీ ఆడాల్సి ఉన్నా, వెన్నునొప్పి కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
దీంతో హోల్కర్ స్టేడియంలో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడతానో లేనో అని తనపై తనకే అనుమానం ఉన్న అద్భుత సెంచరీతో చెలరేగాడు. తాను ఇంతలా చెలరేగి ఆడటానికి కారణం ఒక ఫోన్ కాల్! అని తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత కామెంటేటర్ మంజ్రేకర్‌తో ఏబీ చెప్పుకొచ్చాడు.

20 ఓవర్లలో 148 పరుగులు
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 148 పరుగులు చేసింది. అనంతరం బెంగళూరు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ మైక్ ద్వారా డివిలియర్స్‌తో మాట్లాడాడు. పంజాబ్‌పై అంతగా చెలరేగిపోవడానికి కారణం ఏంటని ఏబీని అడిగాడు.

నా ఇన్నింగ్స్‌ను నమ్మలేకపోతున్నా
‘నా ఇన్నింగ్స్‌ను నమ్మలేకపోతున్నా. రాత్రికి రాత్రే బ్యాడ్ ప్లేయర్ అయిపోయానా అని గత కొన్ని రోజులుగా నాపై నాకే అనుమానం. అందుకే మ్యాచ్‌కు ముందు నా భార్య(డనిల్లే)కు ఫోన్‌చేశా. ఆడగలనో లేదో అనుమానం ఉందన్నా' అని ఏబీ చెప్పాడు. ఆ తర్వాత ఆసీస్ కామెంటేటర్ మిలనె జోన్స్ నీ భార్య ఏం సలహా ఇచ్చిందని అడిగాడు.

ప్రశాంతంగా ఉండమని చెప్పింది
దీనికి డివిలియర్స్ 'అప్పుడామె నా కొడుకు పక్కన తలవాల్చింది. ఆందోళన పడకు. రేపు (మంగళవారం) వచ్చేస్తున్నా. ప్రశాంతంగా ఉండమని చెప్పింది. అదే నాకు స్ఫూర్తినిచ్చిందని అనుకుంటున్నా' అని డివిలియర్స్ అన్నాడు. బెంగళూరుతో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బెంగుళూరు రాయల్ చాలెంజర్స్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకున్న పంజాబ్
149 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయి 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. పంజాబ్ ఓపెనర్ హసీమ్ ఆమ్లా (58 నాటౌట్), కెప్టెన్ మాక్స్‌వెల్ (43 నాటౌట్) చెలరేగడంతో మరో 33 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ లక్ష్యాన్ని చేధించింది. ఈ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పంజాబ్ విజయం సాధించగా.. మూడో మ్యాచ్ ఆడిన బెంగళూరుకు ఇది రెండో ఓటమి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications