ఐపీఎల్ 10 ఫైనల్: పూణె ఓటమికి ఐదు కారణాలు (ఫోటోలు)
హైదరాబాద్: ఐపీఎల్ ట్రోఫీని ఎత్తాలని రైజింగ్ పూణె సూపర్ జెయింట్ చిరకాల కోరిక. అయితే హైదరాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన పైనల్ మ్యాచ్‌లో ఆ కోరిక తీరలేదు. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఒక పరుగు తేడాతో ఘన విజయం సాధించింది.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
తద్వారా మూడోసారి ట్రోఫీని సొంతం చేసుకుని ఐపీఎల్ టైటిల్ మూడుసార్లు అందుకున్న తొలి జట్టుగా కొత్త చరిత్ర సృష్టించింది. పదో సీజన్‌లో టోర్నీ ఆద్యంతం నిలకడను ప్రదర్శించిన ముంబై ఇండియన్స్ తుది పోరులో సైతం సత్తా చాటుకుని మరోసారి ఐపీఎల్ విజేతగా నిలిచింది.
130 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పూణె చివర్లో ఒత్తిడికి గురై వికెట్లను చేజార్చుకుంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఈ విజయంతో పదో సీజన్‌లో లీగ్ దశలో రెండు సార్లు.. ప్లేఆఫ్‌లో ఒకసారి ఓటమి పాలైన ముంబై... పూణెను ఓడించి మొత్తం లెక్కను ఒకేసారి సరి చేసింది.
ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన హార్దిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 38 బంతుల్లో 47 పరుగులు చేసిన పాండ్యా 4 ఓవర్లు వేసి 31 పరుగులిచ్చి ముంబై విజయానికి గట్టి పునాది వేశాడు.
130 పరుగుల లక్ష్య చేధనలో పూణె తొలుత విజయం సాధించేలా కనిపించినప్పటికీ, ఆ తర్వాత విజయం ముంగిట బోల్తా పడింది. అయితే పూణె ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తే మాత్రం ఆశ్చర్యం కలగకమానదు. ఎందుకంటే చివరి ఓవర్లలో పూణె బ్యాట్స్‌మెన్ నిరాశపరిచారు.
పూణె ఓటమికి ఐదు కారణాలు:

బెన్ స్టోక్స్ లేని లోటు
ఈ సీజన్‌లో పూణె పైనల్‌కి రావడంతో కీలకపాత్ర పోషించిన ఆటగాళ్లలో బెన్ స్టోక్స్ ఒకడు. సీజన్ ప్రారంభంలో పూణె పూర్ షో కనబర్చినప్పటికీ, బెన్ స్టోక్స్ రాణించడంతో వరుస విజయాలను సొంతం చేసుకుంది. అయితే తుదిపోరుకు బెన్ స్టోక్స్ లేకపోవడం పూణెకు పెద్ద దెబ్బే. పైనల్ ఆడిన జట్టులో బెన్ స్టోక్స్ ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేది. మిడిల్ ఆర్డర్‌లో స్లో బ్యాటింగ్ కారణంగానే పూణె ఈ మ్యాచ్‌లో ఓడిపోయింది. లీగ్ దశలో అద్భుత ప్రదర్శన చేసిన ఇమ్రాన్ తాహిర్ సేవలను కోల్పోవడం కూడా పూణె ఓటమికి కారణమైంది.

కృనాల్ పాండ్యా ఆల్ రౌండర్ షో
ముంబైకి చెందిన యువ బ్యాట్స్ మెన్ కృనాల్ పాండ్యా పైనల్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో 38 బంతుల్లో 47 పరుగులు చేసి ముంబైకి ఆ మాత్రం స్కోరు వచ్చేలా చేశాడు. 79 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ముంబై జట్టు కష్టాల్లో ఉన్న క్రీజులోకి వచ్చిన పాండ్యా అద్భుత ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా చివరి ఓవర్లో పాండ్యా విధ్వంసం సృష్టించాడు.

ఫైనల్‌లో ప్రారంభం నుంచే నెమ్మదిగా
ఆరంభం నుంచి పూణె ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ప్రారంభించింది. 130 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పూణె మంచి శుభారంభాన్ని ఇవ్వలేకపోయింది. నిజానికి ఈ సీజన్‌లో అజ్యింకె రహానే, రాహుల్ త్రిపాఠిలు బెస్ట్ ఓపెనింగ్ పెయిర్‌గా నిలవలేకపోయారు. బుమ్రా వేసిన మూడో ఓవర్‌లో త్రిపాఠి పెవిలియన్కు చేరడం ముంబైకి కలిసొచ్చింది.

మనోజ్ తివారీకి ముందు ధోని బ్యాటింగ్
మనోజ్ తివారీ కంటే ముందుగా ధోనిని బ్యాటింగ్‌కు దించడం అనేది మిస్ పైర్ అయింది. నిజానికి రహానే అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ధోని స్మిత్‌తో ఆచితూచి ఆడుతూ చక్కటి భాగస్వామ్యాలను నిర్మించేందుకు యత్నించాడు. ఇదే పూణె కొంప ముంచింది. ధోని క్రీజులోకి వచ్చిన సమయానికి పుణెకు 49 బంతుల్లో 59 పరుగులు అవసరం. ఈ సమయంలో ఓవర్‌కు 8 పరుగులు చేస్తే చాలు. ఇది టీ20 ల్లో కష్టమేమి కాదు. కానీ ధోని ఒత్తిడి గురయ్యాడు. ఏ మాత్రం తన సహాజ ఆట తీరును ప్రదర్శించలేక పోయాడు. ఐదు ఓవర్ల పాటు క్రీజులో ఉన్న ధోని ఒక బౌండరీతో కేవలం 13 పరుగులు చేశాడు.

చివరి ఓవర్‌లో తివారీ, స్మిత్ అవుటవ్వటం
ఆఖరి ఓవర్‌లో పూణె విజయానికి 11 పరుగుల అవసరమయ్యాయి. ఈ సమయంలో ముంబై ఇండియన్స్ వ్యూహం బాగా పనిచేసింది. ఫైనల్ ఓవర్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ అనుభవం ఉన్న ఆస్ట్రేలియా మాజీ పేసర్ మిచెల్ జాన్సన్‌తో వేయించాడు. 9 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చివరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సి ఉండగా రెండు పరుగులు మాత్రమే చేశారు. అయితే మూడు పరుగు కోసం ప్రయత్నించిన క్రమంలో వాషింగ్టన్ సుందర్ రనౌట్ అయ్యాడు. లేకుంటే మ్యాచ్ డ్రాగా ముగిసేది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications