Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పదేళ్ల ఐపీఎల్: తక్కువ స్కోర్లు చేసిన జట్లివే, బెంగళూరు చెత్త ప్రదర్శన

హైదరాబాద్: టీ20 క్రికెట్ అంటేనే బౌండరీలు, సిక్సర్లకు పెట్టింది పేరు. ముఖ్యంగా ఈ ఫార్మెట్‌లో బ్యాట్స్‌మెన్లదే పైచేయి. అప్పడప్పుడు బౌలర్లు కూడా తమ సత్తా మేరకు రాణంచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తుంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొమ్మిది సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఈ ఏడాది పదో సీజన్‌లోకి అడుగుపెట్టింది.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

ఈ సందర్భంగా పాఠకుల కోసం ప్రత్యేకంగా 'పదేళ్ల ఐపీఎల్' అంటూ స్పెషల్ ఆర్టికల్స్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో తక్కువ స్కోర్లు నమోదు చేసిన జట్లు కూడా ఉన్నాయి. బౌలర్లు ప్రత్యర్ధి జట్లను తక్కువ పరుగులకే అవుట్ చేయడంలో కీలకపాత్ర పోషించన సందర్భాలు అనేకం. ఐపీఎల్ జరుగుతున్న భారత్‌లోని పిచ్‌లు ముఖ్యంగా స్పిన్నర్లకు ఎంతో అనుకూలం.

ఆదివారం ఈడెన్స్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఐపీఎల్‌లో అతి తక్కువ స్కోరు నమోదు చేసిన జట్టుగా అత్యంత చెత్త రికార్డుని సొంతం చేసుకుంది. విధ్వంసకర బ్యాట్స్ మెన్‌గా పేరొందిన క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ లాంటి ఆటగాళ్లు ఉన్న బెంగళూరు అత్యంత తక్కువ స్కోరు నమోదు చేయడం అభిమానులతో పాటు క్రీడావిశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.

IPL 2017: 10 lowest team totals in IPL history; RCB clock worst performance

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 19.3 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 132 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 9.4 ఓవర్లలో 49 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు గేల్ (7) వికెట్‌ను కాపాడుకునే ప్రయత్నం చేసినా.. రెండో ఎండ్‌లో 13 బంతుల వ్యవధిలో వరుసగా కోహ్లీ (0), మన్‌దీప్ (1), డివిలియర్స్ (8) అవుటయ్యారు.

దీంతో బెంగళూరు జట్టు 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇక ఏడో ఓవర్‌లో వోక్స్.. నాలుగు బంతుల తేడాలో గేల్, బిన్నీ (8)ని అవుట్ చేసి బెంగళూరు ఓటమిని ఖాయం చేశాడు. ఆ తర్వాత వరుస ఓవర్లలో వికెట్లు పడటంతో పాటు 10వ ఓవర్‌లో గ్రాండ్‌హోమీ ఆఖరి రెండు వికెట్లు తీయడంతో కోల్‌కతా 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఐపీఎల్‌ చరిత్లలోనే తక్కువ పరుగులు చేసిన జట్ల వివరాలు:

1. ఐపీఎల్ 2017: బెంగళూరు Vs కోల్ కతా, బెంగళూరు 49 ఆలౌట్ (9.1 ఓవర్లు).
మ్యాచ్ ఫలితం: 82 పరుగుల తేడాతో బెంగళూరు ఓటమి

2. ఐపీఎల్ 2009: బెంగళూరు Vs రాజస్థాన్ రాయల్స్, రాజస్ధాన్ 58 ఆలౌట్ (15.1 ఓవర్లు).
మ్యాచ్ ఫలితం: 75 పరుగుల తేడాతో రాజస్థాన్ ఓటమి

3. ఐపీఎల్ 2008: కోల్ కతా Vs ముంబై, ముంబై 67 ఆలౌట్ (15.2 ఓవర్లు)
మ్యాచ్ ఫలితం: 8 వికెట్ల తేడాతో ముంబై ఓటమి

4. ఐపీఎల్ 2014: బెంగళూరు Vs రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు 70 ఆలౌట్ (15 ఓవర్లు).
మ్యాచ్ ఫలితం: 8 వికెట్ల తేడాతో బెంగళూరు ఓటమి

5. ఐపీఎల్ 2011: కేరళ Vs డెక్కన్ ఛార్జర్స్, కోచి 74 ఆలౌట్ (16.3 ఓవర్లు).
మ్యాచ్ ఫలితం: 55 పరుగుల తేడాతో కోచి ఓటమి

6. ఐపీఎల్ 2013: చెన్నై Vs ముంబై, చెన్నై 79 ఆలౌట్ (15.2 ఓవర్లు).
మ్యాచ్ ఫలితం: 60 పరుగుల తేడాతో చెన్నై ఓటమి

7. ఐపీఎల్ 2013: ఢిల్లీ Vs హైదరాబాద్, ఢిల్లీ 80 ఆలౌట్ (19.1 ఓవర్లు).
మ్యాచ్ ఫలితం: 6 వికెట్ల తేడాతో ఢిల్లీ ఓటమి

8. ఐపీఎల్ 2011: రాజస్థాన్ Vs కోల్ కతా, రాజస్థాన్ 81 ఆలౌట్ (15.2 ఓవర్లు).
మ్యాచ్ ఫలితం: 8 వికెట్ల తేడాతో రాజస్ధాన్ ఓటమి

9. ఐపీఎల్ 2010: డెక్కన్ ఛార్జర్స్ Vs బెంగళూరు, డెక్కన్ ఛార్జర్స్ 82 ఆలౌట్ (18.3 ఓవర్లు).
మ్యాచ్ ఫలితం: 9 వికెట్ల తేడాతో డెక్కన్ ఛార్జర్స్ ఓటమి

10. ఐపీఎల్ 2008: బెంగళూరు Vs కోల్ కతా, బెంగళూరు 82 ఆలౌట్ (15.1 ఓవర్లు).
మ్యాచ్ ఫలితం: 140 పరుగుల తేడాతో బెంగళూరు ఓటమి

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+