For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పదేళ్ల ఐపీఎల్: అత్యధిక పరుగులు చేసిన 10 జట్లు ఇవే

టీ20 క్రికెట్‌ అంటేనే ఎంటర్టైన్మెంట్. కళ్లు చెదిరే ఫోర్లు, సిక్సులు ఈ మ్యాచ్‌ల్లో సర్వ సాధారణం. క్రికెటర్లు సైతం టీ20 మ్యాచ్ అంటే చాలు పూనకం వచ్చిన వాళ్లులాగా చెలరేగి ఆడుతుంటారు.

By Nageshwara Rao

హైదరాబాద్: టీ20 క్రికెట్‌ అంటేనే ఎంటర్టైన్మెంట్. కళ్లు చెదిరే ఫోర్లు, సిక్సులు ఈ మ్యాచ్‌ల్లో సర్వ సాధారణం. క్రికెటర్లు సైతం టీ20 మ్యాచ్ అంటే చాలు పూనకం వచ్చిన వాళ్లులాగా చెలరేగి ఆడుతుంటారు. టీ20 క్రికెట్ విజయవంతం అవడానికి ప్రధాన కారణం ఇదే.

ఈ పొట్టి ఫార్మెట్ ఆటలో జట్టు భారీ స్కోర్లు సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మ్యాచ్‌ల్లో సింగిల్స్‌కు ప్రాధాన్యం ఇవ్వరు. ఫోర్లు, సిక్సులే లక్ష్యంగా ఆటగాళ్లు బరిలోకి దిగుతారు. తొమ్మిది సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఐపీఎల్‌లో ఇలాంటి మ్యాచ్‌లు ఎన్నింటినో చూశాం.

కొన్ని సందర్భాల్లో ఆటగాళ్లు కొట్టిన బంతులు స్టేడియం బయట పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రత్యర్ధి జట్ల బౌలర్లు విసిరే బంతులను బ్యాట్స్‌మెన్ ధీటుగా ఎదుర్కొన్న సందర్భాలు అనేకం. ఇలా బౌలర్లను చీల్చి చెండాడి జట్టు స్కోరు 200కు పైగా చేసిన సందర్భాలు ఉన్నాయి.

IPL 2017: 10 highest team totals in the history of the IPL

ఐపీఎల్ పదో సీజన్‌లోకి ప్రవేశించిన సందర్భంగా (ఏప్రిల్ 24, 2017నాటికి) అత్యధిక పరుగులు చేసిన టాప్ 10 జట్ల వివరాలను పాఠకులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం.

1. బెంగళూరు Vs పూణె 263/5 (ఏప్రిల్ 23, 2013)
ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ 175 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. 30 బంతుల్లో ఐపీఎల్ అత్యంత వేగ వంతమైన సెంచరీని నమోదు చేశాడు.

ఫలితం: బెంగళూరు 130 పరుగుల తేడాతో గెలుపొందింది.


2. బెంగళూరు Vs గుజరాత్ లయన్స్, 248/3 (మే 14, 2016)
విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ సెంచరీలతో చెలరేగడంతో బెంగళూరు 20 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది.

ఫలితం: బెంగళూరు 144 పరుగుల తేడాతో గెలుపొందింది.


3. చెన్నై సూపర్ కింగ్స్ Vs రాజస్ధాన్ రాయల్స్ 246/5 (ఏప్రిల్ 3, 2010)
మురళీ విజయ్ 127 పరుగులతో సెంచరీ నమోదు చేశాడు. చివరి 10 ఓవర్లలో చెన్నై 155 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది.

ఫలితం: చెన్నై 27 పరుగుల తేడాతో గెలుపొందింది.


4. చెన్నై సూపర్ కింగ్స్ Vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 240/5 (ఏప్రిల్ 19, 2008)
ఐపీఎల్‌ చరిత్రలో జరిగిన రెండో మ్యాచ్. ఈ మ్యాచ్‌లో చెన్నై ఆటగాడు మైక్ హస్సీ సెంచరీతో చెలరేగాడు. ధోని నేతృత్వంలోని చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 240 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ 4 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది.

ఫలితం: చెన్నై 33 పరుగుల తేడాతో గెలుపొందింది.


5. బెంగళూరు Vs ముంబై 235/1, (మే 10, 2015)
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (50 బంతుల్లో 82), ఏబీ డివిలియర్స్ (59 బంతుల్లో 133 నాటౌట్) నెలకొల్పిన భాగస్వామ్యం ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు భాగస్వామ్యంగా ఉంది. తొలి వికెట్‌కు వీరిద్దరూ కలిసి చేసిన పరుగులు ఇవి. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై 196 పరుగులకే ఆలౌటైంది.

ఫలితం: బెంగళూరు 39 పరుగుల తేడాతో గెలుపొందింది.


6. పంజాబ్ Vs బెంగళూరు 232/2, (మే 17, 2011)
ఆడమ్ గిల్ క్రిస్ట్ నేతృత్వంలోని పంజాబ్ ఈ మ్యాచ్‌లో చెలరేగింది. ఈ మ్యాచ్‌లో గిల్ క్రిస్ట్ 55 బంతుల్లో 106 పరగులు చేశాడు. ఇందులో 9 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి. ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగళూరు 17 ఓవర్లకే 121 పరుగులు చేసి ఆలౌటైంది.

ఫలితం: పంజాబ్ 111 పరుగుల తేడాతో గెలుపొందింది.


7. పంజాబ్ Vs చెన్నై 231/4, (మే 7, 2014)
మ్యాక్స్ వెల్ 38 బంతుల్లో 90 పరుగులు చేశాడు. దీంతో 20 ఓవర్లకు గాను పంజాబ్ 4 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. కటక్ లో జరిగిన ఈ మ్యాచ్‌లో అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై 187 పరుగులకే ఆలౌటైంది.

ఫలితం: పంజాబ్ 44 పరుగుల తేడాతో గెలుపొందింది.


8. ఢిల్లీ Vs పంజాబ్ 231/4 (ఏప్రిల్ 23, 2011)
రాహుల్ ద్రవిడ్, సెహ్వాగ్ అర్ధసెంచరీలతో చెలరేగారు. దీంతో ఢిల్లీ 20 ఓవర్లకు గాను 4 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది.

ఫలితం: ఢిల్లీ 29 పరుగుల తేడాతో గెలుపొందింది.


9. బెంగళూరు Vs హైదరాబాద్ 227/4, (ఏప్రిల్ 12, 2016)
రెండో వికెట్‌కు ఏబీ డివిలియర్స్ (82), విరాట్ కోహ్లీ (75) పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది.

ఫలితం: బెంగళూరు 45 పరుగుల తేడాతో గెలుపొందింది.


10. బెంగళూరు Vs పంజాబ్ 226/3, (మే 6, 2015)
క్రిస్ గేల్ 57 బంతుల్లో 117 పరుగులు చేశాడు. దీంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పంజాబ్ 88 పరుగులకే ఆలౌటైంది.

ఫలితం: బెంగళూరు 138 పరుగుల తేడాతో గెలుపొందింది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+