For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యువరాజ్ నా రోల్ మోడల్: క్రునాల్ పాండ్యా

ముంబై: తాను టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌కు పెద్ద అభిమానినని ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ క్రునాల్ పాండ్యా తెలిపాడు. తనకు యువరాజ్ రోల్ మోడల్(మార్గదర్శి) అంటూ ఈ పంజాబ్ ఆల్ రౌండర్ ప్రశంసలు కురిపించాడు.

ఇటీవల విశాఖపట్నంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 37 బంతుల్లో 86 పరుగులు చేసిన పాండ్యా.. ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తాను యువరాజ్ సింగ్ ఆటను చూస్తూ ఎంజాయ్ చేస్తానని, ఆయన ఆట అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు.

యువరాజ్ సింగ్ తనకు మార్గదర్శి అని క్రునాల్ పాండ్యా తెలిపాడు. ఇటీవల టీమిండియాలో చోటు దక్కించుకున్న హార్దిక్ పాండ్యా సోదరుడే ఈ క్రునాల్ పాండ్యా. ఇతడు కూడా ముంబై ఇండియన్స్ తరపునే ఆడుతున్నాడు. మే15న ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 6 సిక్సర్లు, 7 ఫోర్లతో క్రునాల్ పాండ్యా విధ్వంసం సృష్టించాడు. దీంతో 80 పరుగులతో తేడాతో ముంబై.. ఢిల్లీపై విజయం సాధించింది.

IPL 2016: Yuvraj Singh is my idol, says Krunal Pandya

'ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న నా ప్రదర్శన పట్ల నేను సంతృప్తిగా ఉన్నా. బ్యాటింగ్, బౌలింగ్ ఏ విభాగమైన బాగా రాణిస్తున్నాను. ఇదే ఫాం కొనసాగించాలనుకుంటున్నాను. మే 21 గుజరాత్ లయన్స్ తో మాకు ఒక మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్‌లో మేమే గెలుస్తామని, ప్లేఆఫ్‌కు వెళతామని నమ్ముతున్నా' అని క్రునాల్ తెలిపాడు.

కాన్పూర్‌లో జరిగే ఈ మ్యాచ్ కోసం రెండ్రోజులపాటు ప్రాక్టీస్ చేస్తున్నామని తెలిపాడు. ఫలితం గురించి ఆలోచించకుండా గెలుపే లక్ష్యంగా ఆడతామని చెప్పాడు. ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న సమయంలో చాలా క్రికెట్ మెళకువలు నేర్చుకున్నానని తెలిపాడు.

'మాకు చాలా మంది దిగ్గజాలున్నారు. హెడ్ కోచ్ రికీ పాంటింగ్, సచిన్ టెండూల్కర్ సార్, జాంటీ రోడ్స్ సార్. రాబిన్ సింగ్(అసిస్టెంట్ కోచ్) దగర్నుంచి బ్యాటింగ్ మెళకువలు నేర్చుకున్నా. అతని సూచనలు బాగా పని చేశాయి' అని క్రునాల్ తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+