For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నన్ను తీసేయండి: ఆర్‌సీబీకి కోహ్లీ విన్నపం!

బెంగళూరు: భారత స్టార్ బ్యాట్స్‌మన్, ప్రస్తుత బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తనను ఆ జట్టు నుంచి తొలగించాలని కోరాడట. అయితే, అది ఇప్పుడు కాదులెండి. ఇండియన్ ప్రీమియర్ లీగ్-3లో బెంగళూరు యజమాన్యానికి ఈ మేరకు విజ్ఞప్తి చేశాడట.

కోహ్లీ.. ఇప్పుడు స్టార్ బ్యాట్స్‌మన్, బెంగళూరు కెప్టెన్ కానీ, అప్పుడు సాధారణ ఆటగాడే. దీంతో కోహ్లీని అప్పట్లో స్టార్స్‌తో నిండిన జట్టులో 5-6 స్థానాల్లో ఆడించేవారు. దీంతో విసిగిపోయి తనని జట్టులోంచి తీసేయమని అడిగాడట.

IPL 2016: When Virat Kohli asked Royal Challengers Bangalore management to drop him from playing XI

'మీరు ఆడిస్తున్న స్థానాల్లో నేను ఏమాత్రం రాణించలేను. టాపార్డర్‌లో ఆడించేట్లయితే తుది జట్టులో ఉంచండి' అని 2011 సీజన్‌కు ముందు కోహ్లీ అడిగాడు. అనంతరం ఆ సీజన్ నుంచి కోహ్లీ బెంగళూరుకు కీలక ఆటగాడిగా మారిపోయాడు. అంతేగాక, ఇప్పుడా జట్టుకే సారథిగా ఎదిగాడు.

క్రిస్ గేల్, ఏబి డివిలియర్స్, షేన్ వాట్సన్ లాంటి బ్యాటింగ్ దిగ్గజాలు బెంగళూరు జట్టులో ఉన్న విషయం తెలిసిందే. వీరంతా ఉన్నప్పటికీ ఇప్పుడా జట్టులో కోహ్లీనే ఫేవరేట్ ఆటగాడిగా ఉండటం గమనార్హం. అంతేగాక, 2008 నుంచి ఐపిఎల్ సీజన్లలో ఒకే జట్టుకు కోహ్లీ ఆడుతుండటం విశేషం.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+