బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా శనివారం గుజరాత్ లయన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, విధ్వంసక బ్యాట్స్‌మన్ ఏబి డివిలియర్స్ చెలరేగడంతో ఆ జట్టు భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
కోహ్లీ, ఏబి డివిలియర్స్ సిక్సర్లతో హోరెత్తించారు. ఐపిఎల్ చరిత్రలోనే మొదటిసారి ఒక ఇన్నింగ్స్‌లో రెండు శతకాలు నమోదుకాగా, బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లకు 248 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన గుజరాత్ 104 పరుగులకు ఆలౌటైంది.
బెంగళూరు 144 పరుగుల ఆధిక్యంతో విజయభేరి మోగించి సరికొత్త చరిత్ర సృష్టించింది. కోహ్లీ, డివిలియర్స్ సృష్టించిన విధ్వంసంతో పలు రికార్డులు బద్దలయ్యాయి.కోహ్లీ, డివిలియర్స్ చేతిలో పంజాబ్ ఓటమి
గుజరాత్ లయన్స్ జట్టు బెంగళూరు చేతిలోనే కాదు, ఆ జట్టు ఆటగాళ్లైన కోహ్లీ, డివిలియర్స్ చేతిలోనూ ఓడిపోయింది. 249 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు చేసింది కేవలం 104 పరుగులే. అంటే.. 129 పరుగులు చేసిన ఏబి డివిలియర్స్ చేతిలో 25 పరుగుల తేడాతో.. 109 పరుగులు చేసిన కోహ్లీ చేతిలో 5 పరుగుల తేడాతో పంజాబ్ ఓటమిపాలైందన్నమాట.

ఎనిమిదేళ్ల రికార్డు బద్దలు
2008లో ఐపిఎల్‌లో తొలి మ్యాచ్‌లో కోల్‌కతా 140 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది. కాగా, లీగ్ చరిత్రలోనే పరుగుల పరంగా ఇదే అత్యంత భారీ విజయం. కాగా, శనివారం గుజరాత్‌ను 144 పరుగులతో చిత్తు చేసి.. అప్పటి పరాభవం తాలూకు రికార్డును బెంగళూరు చెరిపేసింది.
విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు
ఒకే సీజన్లో మూడు శతకాలు బాదిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు.(ఏప్రిల్ 24న గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 100 నాటౌట్, మే 7న పుణెతో జరిగిన మ్యాచ్ లో 108 నాటౌట్, మే14న గుజరాత్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 109పరుగులు)
ఏబి డివిలియర్స్ రికార్డులు
ఐపిఎల్‌లో డివిలియర్స్‌కు ఇది మూడో సెంచరీ. అంతేగాక, డివిలియర్స్ 43 బంతుల్లో సాధించిన సెంచరీ ఐపిఎల్లో ఐదో వేగవంతమైన శతకం.

రికార్డును తిరగరాసిన బెంగళూరు
శనివారం జరిగిన మ్యచ్ లో బెంగళూరు నమోదు చేసిన స్కోరు ఐపిఎల్ లో రెండో అత్యధిక స్కోరు. 2013లో 263 పరుగులతో ఆ జట్టే రికార్డు నెలకొల్పింది.
చివరి 5ఓవర్లలో బెంగళూరు చేసిన పరుగులు 112. టీ20 క్రికెట్లో ఇదే అత్యధికం.
బెంగళూరు ఇన్నింగ్స్‌లో 20 సిక్సర్లు, 16 ఫోర్లు ఉన్నాయి. మొత్తం బౌండరీలతోనే 184 పరుగులొచ్చాయి.
కోహ్లీ అర్ధ సెంచరీ 39 బంతుల్లో పూర్తి చేసి, మరో 14బంతుల్లోనే సెంచరీ పూర్తి చేయడం గమనార్హం. మొత్తం 53 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు.
ఐపిఎల్‌లో తొలిసారి రెండు శతకాలు
ఓ ఐపిఎల్ మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు బ్యాట్స్‌మన్ శతకాలు బాదడమిదే తొలిసారి. మొత్తం టీ20 చరిత్రలో ఇలా జరగడం రెండోసారి.
అత్యధిక భాగస్వామ్య రికార్డు
ఐపిఎల్‌లోనే గాక, టీ20 చరిత్రలోనే కోహ్లీ-డివిలియర్స్‌లు 229 పరుగులతో రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. గతంలో ముంబైపై 215 పరుగులు చేసిన రికార్డు కూడా వీరిపేరిటే ఉంది.