తన విజయాలకు ఆమే కారణమంటున్న రైనా
న్యూఢిల్లీ: గుజరాత్ లయన్స్ కెప్టెన్‌గా తాను విజయవంతమవడం వెనుక తన భార్య ప్రియాంక పాత్ర కూడా ఉందంటున్నాడు సురేశ్ రైనా. ఇప్పటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మహేంద్ర సింగ్ థోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడిన రైనా.. తాజా ఐపిఎల్‌లో గుజరాత్ లయన్స్ కెప్టెన్‍గా తన దూకుడును చూపిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో తన విజయాలకు తన భార్య ప్రియాంకే కారణమని చెబుతున్నాడు రైనా.'పెళ్లయ్యాక ఓ వ్యక్తిగా నేను చాలా మెరుగయ్యా. నాలో ప్రశాంతత పెరిగింది. మరింత బాధ్యతతో మెలగడం నేర్చుకున్నా' అని రైనా పేర్కొన్నాడు.

అంతేగాక, 'ప్రియాంక నాకు చాలా మద్దతుగా నిలుస్తోంది. జట్టు బాధ్యతల వల్ల కొన్ని సార్లు తనకు ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నా. అవన్నీ తను అర్థం చేసుకుంటుంది. ఆమె తోడ్పాటు వల్లే నేను జట్టును సమర్థంగా నడిపించగలుగుతున్నా' అని రైనా తన భార్యపై ప్రశంసలు కురిపించాడు.
ధోనీ నుంచి కెప్టెన్‌గా ఎలా వ్యవహరించాలో నేర్చుకున్నాని తెలిపాడు. కాగా, ఐపీఎల్ ఆరంభం నుంచి తమ జట్టు ఆడే మ్యాచ్‌ల్లో ఒక్కదానికీ డుమ్మా కొట్టని రైనా.. ఈ సీజన్‌లో మాత్రం కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. వచ్చే నెలలో అతడి భార్య తమ తొలి సంతనానికి జన్మనిస్తుండటమే కారణం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications