For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20లో 6వేలు: రెండో భారత ఆటగాడిగా రోహిత్

పుణె: ముంబై ఇండియన్స్ డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తన అద్భుత ఫాంను కొనసాగిస్తున్నాడు. ఆదివారం రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచులో అజేయంగా 85 పరుగులు చేసి తన జట్టును గెలిపించిన రోహిత్ టీ20 ఫార్మాట్‌లో మరో మైలురాయిని సాధించాడు.

ఈ ముంబై ఓపెనర్ టీలో 6వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కాగా ఈ ఫీట్ సాధించిన తొలి భారత ఆటగాడు సురేష్ రైనా. అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఫీట్ సాధించిన ఆరో ఆటగాడిగా రోహిత్ రికార్డులకెక్కాడు.

సురేష్ రైనా తర్వాత టెస్టులు, అంతర్జాతీయ వన్డేలు, టీ20ల్లో సెంచరీలు సాధించిన ఆటగాడు రోహిత్. టీ20 ఫార్మాట్‌లో టీమిండియా మొత్తం 3 శతకాలు, 42 అర్ధ శతకాలు నమోదు చేసింది.

IPL 2016: Rohit Sharma completes 6000 runs in T20, becomes 2nd Indian player

229 టీ20 మ్యాచ్ లాడిన రోహిత్ శర్మ.. 33.50 సగటుతో 6031 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ మాత్రం 131.36గా వుంది. ముంబై ఇండియన్స్ జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు.

అంతేగాక, ముంబై ఇండియన్ సారథిగా రోహిత్ శర్మ ముందుండి జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. ఆదివారం పుణెతో జరిగిన మ్యాచ్ లోనూ 60బంతుల్లో 85 పరుగులు చేసిన రోహిత్.. ముంబైకి 8 వికెట్ల తేడాతో విజయాన్నందించాడు.పుణె 2వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేయగా మరో 9 బంతులు మిగిలుండగానే ముంబై జట్టు గెలుపొందింది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+