న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్-9 సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు భారత్ మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ మెంటర్‌గా వ్యవహరించనున్నారు. న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన సమావేశంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఫ్రాంచైజీ ఈ నియామకాన్ని ప్రకటించింది.
అనుభవజ్ఞుడైన రాహుల్ ద్రవిడ్ తన సలహాలు, సూచనలతో ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టును విజయపథంలో నడిపిస్తారని ఫ్రాంచైజీ బిజినెస్ ఛైర్మన్ కిరణ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ద్రావిడ్‌తో పాటు జట్టుకు ప్రధాన కోచ్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన ప్యాడీ, ముంబై రంజీ ట్రోఫీ మాజీ ఓపెనర్ బారుచాను టెక్నికల్ డైరెక్టర్‌గా నియమించామని తెలిపారు. ప్రస్తుతం నిషేధంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రాహుల్ ద్రవిడ్ గత ఐపీఎల్ సీజన్‌లో పనిచేశారు.
అంతేగాక, రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా కొనసాగుతున్న భారత్ అండర్-19 జట్టు ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో వెస్టిండీస్ జట్టు విజేతగా నిలిచింది.