బెంగుళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 9 కోసం ఆటగాళ్ల ఎంపికకు వేలం శనివారం ఉదయం బెంగళూరులో ప్రారంభమైంది. ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తున్నాయి. గతేడాతి వేలంలో రూ. 16 కోట్లు పలికి ఐపీఎల్ వేలంపాటలో రికార్డు సృష్టించిన టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఈ ఏడాది రూ. 7 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది.

ఐపీఎల్ వేలంలో మొత్తం 351 మంది ఆటగాళ్లను 8 జట్లు ఎంచుకోనున్నాయి. ఈ ఏడాది ముందుగా పూణె సూపర్ గెయిన్ట్స్ వేలాన్ని ప్రారంభించింది. ఇంగ్లాండ్‌కి చెందిన కెవిన్ పీటర్సన్‌ని రూ.3.5 కోట్లకు, భారత క్రికెటర్ ఇషాంత్ శర్మని రూ.3.8 కోట్లకు పూణె సూపర్ గెయిన్ట్స్ దక్కించుకుంది.
ఆస్టేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్‌ను రూ. 9.5 కోట్లకు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ దక్కించుకుంది. రూ. 2.3 కోట్లకు డ్వేస్ స్మిత్‌ను గుజరాత్ లయన్స్ సొంతం చేసుకోగా, ఇషాంత్ శర్మను రూ.3.8 కోట్లకు పుణే జట్టు కొనుగోలు చేసింది. ఆస్టేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను రాజ్‌కోట్ జట్టు రూ. 2.3 కోట్లకు చేజిక్కించుకుంది.
ఉదయం 10.23 వరకు వేలంలో అమ్ముడైన ఆటగాళ్లు:
* రూ. 9.5 కోట్లకు షేన్ వాట్సన్‌ను దక్కించుకున్న బెంగళూరు ఛాలెంజర్స్
* రూ. 7 కోట్లకు యువరాజ్ సింగ్‌ను దక్కించుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్
* కెవిన్ పీటర్సన్‌ని రూ.3.5 కోట్లకు దక్కించుకున్న పూణె సూపర్ గెయిన్ట్స్
* ఇషాంత్ శర్మను రూ.3.8 కోట్లకు దక్కించుకున్న పూణె సూపర్ గెయిన్ట్స్
* రూ. 2.3 కోట్లకు డ్వేస్ స్మిత్‌ను దక్కించుకున్న గుజరాత్ లయన్స్
* రూ. 2.3 కోట్లకు స్టీవ్ స్మిత్‌ను దక్కించుకున్న రాజ్‌కోట్
* రూ. 5.5 కోట్లకు ఆశిష్ నెహ్రాను దక్కించుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్. నెహ్రా కోసం కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లు చివరి వరకు వేలంలో పోటీపడ్డాయి.
* రూ. 3.80 కోట్లకు బట్లర్‌ను దక్కించుకున్న ముంబై
* రూ. కోటికి ఇర్ఫాన్ పఠాన్‌ను దక్కించుకున్న పూణె
* రూ. 2.30 కోట్లుక డెల్ స్టెయిన్‌ను కొనుగోలు చేసిన గుజరాత్
* రూ. 7 కోట్లకు మోరిస్‌ను కొనుగోలు చేసిన ఢిల్లీ
* ఆరోన్ ఫించ్, మార్టిన్ గప్తిల్ అమ్ముడుపోకుండా మిగిలిపోయారు.