Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీకి దూకుడు రుచిని చూపించిన రహానే, భజ్జీ వల్లే..

ముంబై: జట్టు మారినా, ఆటగాళ్లు మారినా.. ధోనీ అంకితభావం మాత్రం మారలేదు. శనివారం నాడు డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ధోనీ సారథ్యంలోని రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టు పంజా విసిరింది. అరంగేట్రం చేసిన తొలిమ్యాచ్‌లోనే ఘన విజయంతో ఈ జట్టు అదిరిపోయే ఆరంభాన్నిచ్చింది.

పేసర్లు ఇషాంత్ శర్మ, మిచెల్ మార్ష్ నిప్పులు చెరిగే బంతులతో ముంబై జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేయగా, స్వల్ప లక్ష్యఛేదనలో అజింక్యా రహానే, డుప్లెసిస్ చెలరేగడంతో సునాయాస విజయంతో పుణె జట్టు శుభారంభం చేసింది.

స్టార్లతో నిండి హాట్ ఫేవరెట్ హోదాతో ఈ సీజన్‌లో అడుగుపెట్టిన ముంబై జట్టు పేలవ బ్యాటింగ్‌తో తొలి మ్యాచ్‌లో ఓటమి చవి చూసింది. మరోవైపు, తొలి మ్యాచ్‌లో పుణె జట్టు అదరగొట్టింది. వాంఖడే స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ సారథ్యంలోని పుణె జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఐపీఎల్ 2016

ఐపీఎల్ 2016

122 పరుగుల లక్ష్యఛేదనలో ఓపెనర్ రహానె (66 నాటౌట్ - 42 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ హాఫ్ సెంచరీతో విజృంభించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఐపీఎల్ 2016

ఐపీఎల్ 2016

అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న రహానె తొలివికెట్‌కు డుప్లెసిస్ (34 - 33 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లు)తో కలిసి 9.4 ఓవర్లలోనే 78 పరుగులు జోడించి అద్భుత శుభారంభాన్నిచ్చాడు.

ఐపీఎల్ 2016

ఐపీఎల్ 2016

ఇక జట్టు స్కోరు 78 పరుగుల వద్ద హర్భజన్ బౌలింగ్‌లో డుప్లెసిస్ వెనుదిరిగినా, పీటర్సన్ (21 నాటౌట్ - 14 బంతుల్లో 2 సిక్సర్లు)తో కలిసి రహానే జట్టుకు ఘన విజయాన్ని అందించాడు.

ఐపీఎల్ 2016

ఐపీఎల్ 2016

ముంబై జట్టుకు ఎలాంటి అవకాశాన్ని ఇవ్వకుండా రహానే జోరుగా ఆడడంతో 14.4 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 126 పరుగులు చేసి పుణె జట్టు గెలుపు లాంఛనాన్ని పూర్తి చేసింది. రహానేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

 ఐపీఎల్ 2016

ఐపీఎల్ 2016

ముంబై 121 పరుగులు చేయడానికి ఎంత కష్టపడిందో, లక్ష్యాన్ని అంత తేలిగ్గా ఛేదించేసింది పుణె. మంబై బ్యాట్స్‌మెన్‌ సింగిల్స్‌ తీయడానికీ ఆపసోపాలు పడ్డ పిచ్‌ మీద.. పుణె బ్యాట్స్‌మెన్‌ అలవోకగా సిక్సర్లు బాదేశారు. పిచ్‌లో ఏమీ లేదని హర్భజన్‌ చూపించడంతో ఆరంభం నుంచే రహానె, డుప్లెసిస్‌ ధాటిగా ఆడారు.

 ఐపీఎల్ 2016

ఐపీఎల్ 2016

ముంబై తరఫున హర్బజన్ సింగ్ (45 నాటౌట్ - 30 బంతుల్లో 7×4, 1×6) పోరాడకుంటే ఆ జట్టు కనీసం వంద పరుగులైనా చేసేది కాదు.

 ఐపీఎల్ 2016

ఐపీఎల్ 2016

వేగంగా ఆడలేడు.. భారీ షాట్లు కొట్టలేడు.. స్ట్రైక్‌ రొటేట్‌ చేయలేడు.. ఇలాంటి సందేహాలెన్నో రహానె మీద ఉన్నాయి. ఈ కారణాలతోనే అతడికి టీ20 ప్రపంచకప్‌లో, అంతకుముందు కొన్ని మ్యాచ్‌ల్లో ధోనీ తుది జట్టులో చోటివ్వలేదు. కానీ ఇప్పుడు అదే ధోని నాయకత్వంలో పుణెకు ఆడుతూ.. తన ధాటిని చూపించాడు రహానె.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+