కోల్‌కతా: ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై తమ జట్టు గెలిచిన సందర్భంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ కొంత దూకుడుగా ప్రవర్తించి కూర్చీని తన్నేశాడు. దీంతో అతని మ్యాచ్ ఫీజులో 15శాతం కోతపడింది. అయినా, అతని నైజంలో మార్పు రాలేదు. మరోసారి అలాగే ప్రవర్తించాడు.
సోమవారం ఈడెన్‌గార్డెన్ మైదానంలో బెంగళూరుతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో గంభీర్ సహనాన్ని కోల్పోయాడు. మైదానంలోనే అంపైర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. 19వ ఓవర్లో విరాట్ కోహ్లీ బాదిన బంతి గంభీర్ చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో నాన్‌స్ట్రైకర్ ఇండ్ వైపు రన్ కోసం పరుగు తీస్తున్న కోహ్లీపైకి బంతి విసిరాడు గంభీర్.
ఆండ్రూ రస్సెల్ నుంచి బంతి తీసుకోవడంపై అంపైర్‌తో అనవసర వివాదానికి దిగాడు గంభీర్. అంపైర్‌తో తీవ్ర వాగ్వాదం పెట్టుకున్న తర్వాత కాసేపటికి తిరిగి తన స్థానానికి చేరుకున్నాడు గంభీర్. ఈ ప్రవర్తన కారణంగా మరోసారి గంభీర్‌కు జరిమానా పడే అవకాశం లేకపోలేదు.

మే 2న బెంగళూరుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా కూర్చిని తన్ని తన మ్యాచ్ లో 15శాతం కోత పెట్టించుకున్నాడు గంభీర్. ఆ తర్వాత మరోసారి కోత పడే అవకాశాన్ని కూడా కోరి తెచ్చుకున్నాడు.
కాగా, గంభీర్ ప్రవర్తనపై జడేజా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. 'గాయపడినా కూడా తన జట్టును గెలిపించేందుకు కోహ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. అతనిపైకి బంతి విసరడం ఏంటీ? అందుకే నీవు టీమిండియా నుంచి బయటికి విసిరివేయబడ్డావు' అంటూ జడేజా తీవ్రంగా స్పందించాడు.