హైదరాబాద్‌కు ఢిల్లీ షాక్: లక్ష్మణ్ సతీమణి సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: వరుస విజయాలతో జోరుమీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఢిల్లీ డేర్‌డెవిల్స్ షాకిచ్చింది. గురువారం ఇక్కడ జరిగిన ఐపిఎల్ గ్రూప్ మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్, 20 ఓవర్లలో 146 పరుగులు చేయగా.. ఢిల్లీ డేర్‌డెవిల్స్ మరో 11 బంతులు మిగిలి ఉండగానే, 3 వికెట్లు నష్టపోయి 150 పరుగులు సాధించింది. దీంతో సన్‌రైజర్స్‌కు సొంతమైదానంలో ఓటమి తప్పలేదు.
తొలుత డేర్‌డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు కెప్టెన్ డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ పార్ట్‌నర్‌షిప్‌ను అందించారు. 8.5 ఓవర్లలో 67 పరుగులు జోడించిన తర్వాత జయంత్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ వెనుదిరిగిన వార్నర్.. 30 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 46 పరుగులు సాధించాడు.
ధావన్ 37 బంతులు ఎదుర్కొని 34 పరుగుల చేసి, అమిత్ మిశ్రా బౌలింగ్‌లో సంజూ శాంసన్‌కు చిక్కాడు. అతని స్కోరులో మూడు ఫోర్లు ఉన్నాయి. యువరాజ్ సింగ్ (8), మోజెస్ హెన్రిక్స్ (0) క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయారు. భూపీందర్ హూడా 9 బంతుల్లో 10 పరుగులు చేసి నాథన్ కౌల్టన్ నైల్ బౌలింగ్‌లో బంతిని కొట్టబోయి హిట్ వికెట్‌గా ఔటయ్యాడు.
సన్‌రైజర్స్ స్కోరును 150 పరుగుల మైలురాయిని దాటిస్తాడనుకున్న కేన్ విలియమ్సన్ 24 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 27 పరుగులు చేసి క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో ఔట్ కావడంతో సన్‌రైజర్స్ రన్‌రేట్ గణనీయంగా తగ్గింది. నమన్ ఓఝా (7), భవనేశ్వన్ కుమార్ (1) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు.
దీంతో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. బరీందర్ శరణ్, ఆశిష్ నెహ్రా చెరొక పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. కగా, డేర్‌డెవిల్స్ బౌలర్లు నాథన్ కౌల్టర్ నైల్, అమిత్ మిశ్రా చెరి రెండు వికెట్లు పడగొట్టారు. మిశ్రా మూడు ఓవర్లు బౌల్ చేసి, కేవలం 19 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. మిశ్రా.. ధావన్, యువరాజ్ సింగ్‌లను వెనక్కు పంపి, సన్‌రైజర్స్‌ను కట్టడి చేశాడు.
సన్‌రైజర్స్ విధించిన లక్ష్యం 147 పరుగులు సాధించాల్సి ఉండగా డేర్‌డెవిల్స్ ఆటగాళ్లు ఆచితూచి ముందుకు సాగారు. మాయాంక్ అగర్వాల్ 10 పరుగులు చేసి ఆశిష్ నెహ్రా బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ క్యాచ్ అందుకోవడంతో ఔట్‌కాగా, కరుణ్ నాయర్ 17 బంతులు ఎదుర్కొని, 20 పరుగులు చేసి మోజెన్ హెన్రిక్స్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
ఓపెనర్ క్వింటన్ డికాక్ వ్యూహాత్మంగా ఆడాడు. ఇతడు 31 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 44 పరుగులు సాధించి మోజెస్ హెన్రిక్స్ బౌలింగ్‌లోనే నమన్ ఓఝాకు చిక్కాడు. 78 పరుగులకు మూడు వికెట్లు కూలగా, సంజూ శాంసన్, రిషభ్ పంత్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ 18.1 ఓవర్లలోనే డేర్‌డెవిల్స్‌ను విజయతీరాలకు చేర్చారు.
మూడు వికెట్లకు 150 పరుగులు సాధించిన ఈ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సంజూ శాంసన్ 26 బంతుల్లో 34, రిషభ్ పంత్ 26 బంతుల్లో 39 చొప్పున పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

ఔట్ అప్పీల్
వరుస విజయాలతో జోరుమీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఢిల్లీ డేర్‌డెవిల్స్ షాకిచ్చింది. గురువారం ఇక్కడ జరిగిన ఐపిఎల్ గ్రూప్ మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

వికెట్ తీశారు
తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్, 20 ఓవర్లలో 146 పరుగులు చేయగా.. ఢిల్లీ డేర్‌డెవిల్స్ మరో 11 బంతులు మిగిలి ఉండగానే, 3 వికెట్లు నష్టపోయి 150 పరుగులు సాధించింది. దీంతో సన్‌రైజర్స్‌కు సొంతమైదానంలో ఓటమి తప్పలేదు.

ధావన్ ఔట్
తొలుత డేర్‌డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు కెప్టెన్ డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ పార్ట్‌నర్‌షిప్‌ను అందించారు.

అభిమానుల సందడి
8.5 ఓవర్లలో 67 పరుగులు జోడించిన తర్వాత జయంత్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ వెనుదిరిగిన వార్నర్.. 30 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 46 పరుగులు సాధించాడు.

అభిమానుల సందడి
ధావన్ 37 బంతులు ఎదుర్కొని 34 పరుగుల చేసి, అమిత్ మిశ్రా బౌలింగ్‌లో సంజూ శాంసన్‌కు చిక్కాడు. అతని స్కోరులో మూడు ఫోర్లు ఉన్నాయి.

మ్యాచ్
యువరాజ్ సింగ్ (8), మోజెస్ హెన్రిక్స్ (0) క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయారు. భూపీందర్ హూడా 9 బంతుల్లో 10 పరుగులు చేసి నాథన్ కౌల్టన్ నైల్ బౌలింగ్‌లో బంతిని కొట్టబోయి హిట్ వికెట్‌గా ఔటయ్యాడు.

అభిమానుల సందడి
సన్‌రైజర్స్ స్కోరును 150 పరుగుల మైలురాయిని దాటిస్తాడనుకున్న కేన్ విలియమ్సన్ 24 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 27 పరుగులు చేసి క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో ఔట్ కావడంతో సన్‌రైజర్స్ రన్‌రేట్ గణనీయంగా తగ్గింది.

అభిమానుల సందడి
నమన్ ఓఝా (7), భవనేశ్వన్ కుమార్ (1) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు.
దీంతో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేయగలిగింది.

అభిమానుల సందడి
బరీందర్ శరణ్, ఆశిష్ నెహ్రా చెరొక పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. కగా, డేర్‌డెవిల్స్ బౌలర్లు నాథన్ కౌల్టర్ నైల్, అమిత్ మిశ్రా చెరి రెండు వికెట్లు పడగొట్టారు.

ఛీర్ లీడర్స్
మిశ్రా మూడు ఓవర్లు బౌల్ చేసి, కేవలం 19 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. మిశ్రా.. ధావన్, యువరాజ్ సింగ్‌లను వెనక్కు పంపి, సన్‌రైజర్స్‌ను కట్టడి చేశాడు.

వివియస్ లక్ష్మణ్ సతీమణి, పిల్లలు
ఈ ఐపీఎల్ సీజన్లో నగరంలో ఇది చివరి మ్యాచ్ కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. పలువురు సినీతారలు, క్రీడాకారులు సందడి చేశారు. మాజీ భారత క్రికెటర్ వివియస్ లక్ష్మణ్ సతీమణి, పిల్లలతో పాటు వచ్చి సందడి చేశారు.
ఈ మ్యాచ్ విశేషాలు:
సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్‌లో 46 పరుగులు సాధించే క్రమంలో ఈసీజన్‌లో 500 పరుగుల మైలురాయిని అధిగమించాడు. అంతేగాక, వరుసగా రెండు ఐపిఎల్ సీజన్లలో ఐదు వందలకుపైగా పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. ఇంతకు ముందు క్రిస్ గేల్ (2014, 2015, 2016) ఈ ఫీట్ సాధించాడు.
కాగా, ఈ మ్యాచ్‌లోనే వార్నర్ ఐపిఎల్‌లో మూడు వేల పరుగులను పూర్తి చేశాడు. ఈ మైలురాయిని అధిగమించిన ఎనిమిదో బ్యాట్స్‌మన్‌గా, రెండో విదేశీ ఆటగాడిగా అతని పేరు రికార్డుల్లో చేరింది.
పవర్ ప్లేలో సన్‌రైజర్స్ 51, డేర్‌డెవిల్స్ 50 చొప్పున మొత్తం 101 పరుగులు జత కలిశాయి. ఈసారి ఐపిఎల్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఇది ఏడో మ్యాచ్‌కాగా, పవర్ ప్లేలో నమోదైన అత్యధిక పరుగులు ఇవే.
లక్ష్మణ్ భార్య, పిల్లల సందడి
హైదరాబాద్-ఢిల్లీ మ్యాచ్ సందర్భంగా గురువారం ఉప్పల్ స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోయింది. చీర్ గర్ల్స్ డ్యాన్స్‌లతో ఉర్రూతలూగింది. ఈ ఐపీఎల్ సీజన్లో నగరంలో ఇది చివరి మ్యాచ్ కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. పలువురు సినీతారలు, క్రీడాకారులు సందడి చేశారు. మాజీ భారత క్రికెటర్ వివియస్ లక్ష్మణ్ సతీమణి, పిల్లలతో పాటు వచ్చి సందడి చేశారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా మ్యాచ్ తిలకించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications