భజ్జీని 'పిచ్చోడ'ని సెహ్వాగ్: సంచలనాత్మక బ్యాటింగ్ (పిక్చర్స్)
ముంబై: ఐపీఎల్ 8లో భాగంగా ఆదివారం నాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హర్భజన్ సింగ్ పోరాడినా ముంబైని గెలిపించుకోలేకపోయాడు. భజ్జీ భీకరమైన బ్యాటింగ్ చేశాడు. దీని పైన వీరేంద్ర సెహ్వాగ్ మ్యాచ్ అనంతరం స్పందించాడు.
హర్భజన్ సింగ్ 'పాగల్' అయ్యాడని నవ్వుతూ సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. భజ్జీ దూకుడు పైన స్పందించమని మ్యాచ్ అనంతరం కోరగా... 'ఈ రోజు సర్దార్ (భజ్జీ) పిచ్చోడిగా మారాడనుకుంటున్నా' అని నవ్వుతూ వ్యాఖ్యానించాడు.
సెహ్వాగ్, హర్భజన్ సింగ్ స్నేహితులు. ఆ చొరవతోనే భజ్జీ రెచ్చిపోయి ఆడటాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. అంతకుముందు ఇన్నింగ్సులో సెహ్వాగ్ 19 బంతుల్లో 36 పరుగులు చేశాడు. కాగా వీరిద్దరు టీమిండియాకు ఆడిన వారే. పేలవ ఫాంతో జట్టుకు దూరమయ్యారు.
కాగా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 5 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఆ తర్వాత ముంబై 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేసింది. 18 పరుగుల తేడాతో ఓడింది.
అయితే, ఈ మ్యాచ్‌లో ముంబై ఓడినప్పటికీ ఆ జట్టు ఆటగాడు భజ్జీ అందర్నీ ఆకట్టుకున్నాడు. ముంబై 59 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కనీసం వంద పరుగులైనా చేస్తుందా, అవమానకర ఓటమి తప్పదా అని అందరూ భావిస్తున్న సమయంలో క్రీజులోకి వచ్చి భజ్జీ సంచలనాత్మక బ్యాటింగ్ చేశాడు. 24 బంతుల్లో 64 పరుగులు (ఐదు ఫోర్లు, 6 సిక్స్‌లు) చేశాడు. 19 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు.

మురళీ విజయ్ బ్యాటింగ్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఒంటి చేత్తో విజయం సాధించాలనే ముంబై ఇండియన్స్ ఆటగాడు హర్భజన్ ఆశలు గల్లంతయ్యాయి.

భజ్జీ వికెట్ తీసిన ఆనందంలో ముంబై ఇండియన్స్
ప్రతి బంతినీ ఫోర్‌గానో, సిక్స్‌గానో బౌండరీ దాటిస్తూ పంజాబ్ బౌలర్లకు అతను దడ పుట్టించాడు. ముంబై ఎదుట పంజాబ్ నిర్దేశించిన లక్ష్యం178 పరుగులు.

వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్
అయితే టాప్ ఫైవ్ బ్యాట్స్‌మెన్ మరీ ఘోరంగా కేవలం 33 పరుగులే చేయడంతో ముంబై 14 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లకు 59 పరుగులే చేసింది.

షాట్ ఆడుతున్న డేవిడ్ మిల్లర్
అప్పటికి ఒక పరుగుతో క్రీజులో ఉన్న హర్భజన్ భీకరమైన ఇన్నింగ్స్ దెబ్బకు ముంబై 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది.

షాట్ ఆడుతున్న బెయిలీ
సుచిత్ (34 నాటౌట్)తో కలిసి భజ్జీ 16.21 ఎకానమీరేటుతో సరిగ్గా 100 పరుగులు జోడించాడు. అంతకుముందు సెహ్వాగ్ (19 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 36), విజయ్ (35), బెయిలీ (61నాటౌట్) రాణించడంతో పంజాబ్ 5 వికెట్లకు 177 పరుగులు చేసింది.

వికెట్ తీసిన ఆనందంలో మలింగ
ముంబై ఇండియన్స్ 18 పరుగుల తేడాతో పంజాబ్‌పై ఓటమి పాలైంది. సుచిత్ (34 నాటౌట్)తో కలిసి భజ్జీ ఏడో వికెట్‌కు 37 బంతుల్లోనే వంద పరుగులు జోడించి పంజాబ్‌కు గుబులు పుట్టించాడు.

పొలార్డ్ వికెట్ తీసిన ఆనందంలో పంజాబ్ ఆటగాళ్లు.
పంజాబ్ నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యఛేదనలో ముంబై ఓవర్లన్నీ ఆడి ఏడు వికెట్లకు 159 రన్స్ చేసింది. పంజాబ్ బౌలర్లలో జాన్సన్, అక్షర్, అనురీత్ తలో రెండు వికెట్లు తీశారు.

హర్భజన్ సింగ్
ఐపీఎల్ 8లో భాగంగా ఆదివారం నాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హర్భజన్ సింగ్ పోరాడినా ముంబైని గెలిపించుకోలేకపోయాడు. భజ్జీ భీకరమైన బ్యాటింగ్ చేశాడు.

విజయం అనంతరం
ఐపీఎల్ 8లో భాగంగా ఆదివారం నాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హర్భజన్ సింగ్ పోరాడినా ముంబైని గెలిపించుకోలేకపోయాడు. భజ్జీ భీకరమైన బ్యాటింగ్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications