For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2015: సూపర్ ఓవర్ అంటే ఏమిటి, ఎలా ఆడతారు?

By Nageswara Rao

అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 8లో తొలి సూపర్ ఓవర్ మ్యాచ్‌ని అభిమానులు వీక్షించారు. ఐపీఎల్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని సర్ధార్ పటేల్ స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ Vs రాజస్ధాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సూపర్ ఓవర్‌ను అభిమానులు కళ్లారా చూశారు.

సూపర్ ఓవర్:

సూపర్ ఓవర్ అనేది ఒక ఓవర్ పోటీ. ట్వంటీ20 ఫార్మెట్‌లో రెండు జట్లు సమానమైన స్కోరు చేస్తే మ్యాచ్ ఫలితాన్ని తేల్చడం కోసం ఈ సూపర్ ఓవర్‌ను ప్రవేశపెట్టారు.

ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో భాగంగా కూడా ఫైనల్ మ్యాచ్ గనుక టై అయితే మ్యాచ్ ఫలితాన్ని తేల్చడం కోసం ఈ సూపర్ ఓవర్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రవేశపెట్టింది. అయితే వరల్డ్ కప్‌లో ఈ సూపర్ ఓవర్ పోటీని ఉపయోగించలేదు. కారణం వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఆస్టేలియాల అలవోకగా విజయం సాధించడమే.

IPL 2015: What is a Super Over?

గతంలో ట్వంటీ20 మ్యాచ్‌ల్లో టై అయితే, బోల్ ఔట్ ద్వారా విజేతను నిర్ణయించేవారు. ఇరు జట్ల నుంచి ఐదుగురు బౌలర్లు వికెట్లకు బౌలింగ్ వేస్తారు. ఏ జట్టులో అయితే ముగ్గురు బౌలర్లు వికెట్లను పడగొడ్తారో ఆ జట్టు విజేతగా ప్రకటిస్తారు. ఈ పద్ధతిలో ఇప్పుడు సూపర్ ఓవర్‌ను ఐసీసీ 2008లో ప్రవేశపెట్టింది.

దక్షిణాఫ్రికాలో భారత్ గెలుచుకున్న ట్వంటీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ షిప్‌లో ఈ బౌల్ ఔట్ పద్ధతిని ఉపయోగించారు. ఈ టోర్నమెంట్‌లో భారత్ - పాకిస్ధాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బౌల్ ఔట్‌ని ఉపయోగించారు.

సూపర్ ఓవర్‌ను ఎలా ఆడతారు?

* సాధారణ ఐపీఎల్ మ్యాచ్ మాదిరే ఈ ఓవర్‌లో ఆటగాళ్లంతా మైదానంలో ఆడతారు. ఫీల్డింగ్ పరిమితులు కూడా ఒకేలా ఉంటాయి.

* ఏ జట్టు అయితే రెండోసారి బ్యాటింగ్ ఆడుతుందో ఆ జట్టు సూపర్ ఓవర్‌ను మొదట ఆడుతుంది.

* అంఫైర్లు నిర్దేశించిన బాక్సు నుంచి ఏ బౌలర్ బౌలింగ్ వేయాలో ఆ జట్టు కెప్టెన్ నిర్ణయం తీసుకుంటాడు.

* సూపర్ ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయిన జట్టు ఓటిమి పాలవుతుంది.

* సూపర్ ఓవర్‌లో ఏ జట్టు అయితే అత్యధిక పరుగులు చేస్తుందో వారే విజేతలు.

రాజస్ధాన్ రాయల్స్ Vs కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ ఎలా?

రాజస్ధాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో పంజాబ్ జట్టు 9 పరుగుల తేడాతో రాజస్ధాన్‌ను ఓడించింది. సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 15 పరుగులు చేయగా, ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన రాజస్దాన్ 6 పరుగులు మాత్రమే చేసింది.

సూపర్ ఓవర్‌లో పంజాబ్ తొలి బంతికే డేవిడ్ మిల్లర్ వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాతి 5 బంతుల్లో 15 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్ధాన్ తొలి బంతికే వాట్సన్‌ ఔట్ అవగా, మూడో బంతికి ఫల్కనర్ రనౌట్ అయ్యాడు. సూపర్ ఓవర్ రూల్ ప్రకారం రెండు వికెట్లు పడితే ఆ జట్టు ఓటమి పాలవుతుంది. దీంతో అంఫైర్లు పంజాబ్‌ను విజేతగా ప్రకటించారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+