బెంగుళూరు: ఇండియా వాళ్ళ సంబరమంటూ ఐపీఎల్ 8వ ఎడిషన్ మొదలై ఆరు రోజులు గడిచిపోయింది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఐపీఎల్ 8వ ఎడిషన్ వేలం పాటలో అత్యధిక ధరలు చెల్లించి ప్రాంఛైజీలు కొనుగోలు చేసిన ఆటగాళ్లు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశారు.
ఢిపెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన కోల్‌కత్తా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఏప్రిల్ 8న జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్ ఆరంభమైంది. గౌతం గంభీర్ సారధ్యంలోని కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది.
వేలం పాటలో అత్యధిక ధర పలికి ఐపీఎల్ టోర్నమెంట్లో ఏ మాత్రం అత్యత్తమ ప్రదర్శనను కనబరచనటువంటి టాప్ - 5 ఆటగాళ్ల జాబితాను అభిమానుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం.

1. యవరాజ్ సింగ్ (ధర - రూ. 16 కోట్లు) - ఢిల్లీ డేర్ డెవిల్స్
ఆడిన మ్యాచ్‌లు - 2, పరుగులు - 36
ఈ ఏడాది ఐపీఎల్ వేలం పాటలో అత్యధిక ధర పలికిన ఆటగాడు యువరాజ్ సింగ్. ఈ ఎడమ చేతి వాట బ్యాట్స్‌మెన్‌పై ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఢిల్లీ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో యువరాజ్ సింగ్ మ్యాజిక్ ఎంత మాత్రం పనిచేయలేదు. రాబోయే మ్యాచ్‌ల్లోనైనా యువరాజ్ విజృంభిస్తాడో లేదో చూడాలి?
2. దినేశ్ కార్తిక్ (ధర రూ. 10.5 కోట్లు) - రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు
ఆడిన మ్యాచ్‌లు - 2, పరుగులు - 15
దినేశ్ కార్తిక్‌ను వికెట్ కీపర్‌గా రాయల్ ఛాలెంజర్స్ జట్టు వేలం పాటలో దక్కించుకుంది. అనూహ్యాంగా ఈ ఏడాది వేలం పాటలో రూ. 10.5 కోట్లు పలికాడు. ఆ ధరకు సరైన న్యాయం చేయడం లేదని బెంగుళూరు అభిమానులు వాపోతున్నారు.
3. సురేష్ రైనా (చెన్నై సూపర్ కింగ్స్)
ఆడిన మ్యాచ్‌లు - 2, పరుగులు - 18
ఇటీవలే పెళ్లి కొడుకైన సురేష్ రైనా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అధ్బుత అటగాడు. చెన్నై జట్టులో ఉన్న స్టార్ బ్యాట్స్‌మెన్స్‌లో సురేష్ రైనా ఒకడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో కానీ ఈ ఐపీఎల్‌లో తన సత్తా చాటడంలో విఫలమయ్యాడు.
4. రవీంద్ర జడేజా (చెన్నై సూపర్ కింగ్స్)
ఆడిన మ్యాచ్‌లు - 2, పరుగులు - 17
ఇటీవల న్యూజిలాండ్, ఆస్టేలియాలో జరిగిన ఐసీసీ వరల్డ్ కప్‌లో కాస్త ఫరవాలేదనిపించుకున్నాడు 'సర్' రవీంద్ర జడేజా. అయితే ఇప్పటికే ప్రారంభమైన ఐపీఎల్‌లో మాత్రం తనదైన ముద్రను వేయడంలో ప్రభావం చూపలేక పోయాడు.
5. ఇషాంత్ శర్మ (సన్ రైజర్స్ హైదరాబాద్)
ఆడిన మ్యాచ్‌లు - 1, వికెట్లు - 0 0/46 in 3 overs
గాయం కారణంగా ఐసీసీ వరల్డ్ కప్‌లో ఆడే అవకాశాన్ని కోల్పోయాడు ఇషాంత్ శర్మ. చెన్నై సూపర్ కింగ్స్‌తో గత వారంలో జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ రీ ఎంట్రీ అనుభవం అతనికి మరిచిపోలేనిది. 3 ఓవర్లలో 46 పరుగులిచ్చాడు. దీంతో తర్వాతి మ్యాచ్‌కి తుది జట్టులో చోటు కొల్పోయాడు.
గమనిక: పైన వెల్లడించిన ఆటగాళ్ల వివరాలు కేవలం ఒక్క వారాన్ని దృష్టిలో పెట్టుకొని తెలపడమైంది. రాబోయే ఐపీఎల్ మ్యాచ్‌ల్లో వీరు అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చే అవకాశం కూడా ఉంది.