Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆటాడించిన సర్ఫరాజ్, చేతులు జోడించిన కోహ్లీ: వరుణుడితో నీళ్ల పాలు

బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఆటగాడు సర్ఫరాజ్ రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను ఆటాడించాడు. బౌలర్ల బంతులను ఉతికి ఆరేశాడు. అయితే, వరుణుడు దెబ్బ తీయడంతో ఫలితం లేకుండా పోయింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో బెంగళూర్‌కు ఎదురు దెబ్బ తగిలింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 7 ఓవర్లలో సరిగ్గా 200 పరుగులు చేసిన దశలో వర్షం మొదలైంది. తర్వాత ఇక తెరిపినివ్వకపోయేసరికి అంపైర్లు ఆటను రద్దుచేస్తున్నట్టు ప్రకటించారు.

బెంగళూరు ఇన్నింగ్స్‌లో డివిలియర్స్ (57; 45 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్), సర్ఫరాజ్ ఖాన్ (45; 21 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్) అద్భుత ప్రదర్శన చేశారు. మణ్‌దీప్, దినేశ్ కార్తీక్ 27 పరుగుల చొప్పున చేశారు.15 ఓవర్లలో బెంగళూరు స్కోరు 130 పరుగులే. అప్పటికే, ఆ జట్టు ధాటిగా ఆడే డివిలియర్స్ వికెట్‌తో సహా మరో మూడు వికెట్లు కోల్పోయింది. దినేశ్ కార్తీక్ అప్పటికే ధాటిగా ఆడుతున్నా, ఎంత సేపు నిలబడుతాడనే విషయంపై నమ్మకం లేదు.

Sarfaraj Khan

కార్తీక్ జతగా మరో ఎండ్‌లో కుర్ర బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్ అద్భుతం చేశాడు. కాకలుతీరిన బ్యాట్స్‌మన్ తరహాలో మైదానం నలుమూలలా బౌండ్రీల వెల్లువతో హోరెత్తించాడు. 17వ ఓవర్లో 4, 4.. ఆపై 18వ ఓవర్లో 4, 6, 4 కొట్టి రాజస్థాన్ బౌలర్లకు గుండె దడ పుట్టించాడు.

ఈ మధ్యలో కార్తీక్, వైజ్ (11) ఔటైనా, ఖాన్ నిలబడ్డాడు. ఆఖరు బంతికి హర్షల్ (6) పటేల్ రనౌటయ్యాడు. ఖాన్ ధాటికి 15-20 ఓవర్ల మధ్య వరుసగా 12, 15, 18, 13,12 చొప్పున మొత్తంగా 70 పరుగులొచ్చాయి. సర్ఫరాజ్ అజేయ ఇన్నింగ్స్‌తో పెవిలియన్‌కొస్తున్నవేళ.. కెప్టెన్ కోహ్లీ డగౌట్లోంచి మైదానంలోకి దూసుకొచ్చి అతనికి నమస్తే జీ అంటూ రెండు చేతులు జోడించి అభినందించాడు.

బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. సౌథీ తన వరుస ఓవర్లలో బెంగళూరుకు షాక్‌మీద షాక్ ఇచ్చాడు. తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో సిక్స్, ఫోర్‌తో హల్‌చల్ చేసిన గేల్ (10) అదే ఓవర్లో ఔటయ్యాడు. ఇక మూడో ఓవర్లో ఆఫ్ స్టంప్ వదిలి వెళుతున్న బంతిని వెంటాడే యత్నంలో కోహ్లీ కీపర్ శామ్‌సన్ చేతికి చిక్కాడు. ఈ దశలో మణ్‌దీప్ జతగా డివిలియర్స్ బెంగళూరు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దదడమే కాకుండా భారీషాట్లతో పరుగులెత్తించాడు.

ఫాల్క్‌నర్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో వరుస బంతుల్లో 4, 4, 4 కొట్టిన డివిలియర్స్ కొద్దిసేపటికి తంబెను 4, 4, 4 బాదాడు. ఫలితంగా తొలి పది ఓవర్లలో బెంగళూరు చక్కని రన్‌రేట్‌తో 83 పరుగులు చేసింది. 12వ ఓవర్లో మణ్‌దీప్ (27)ను ఔట్ చేయడం ద్వారా బిన్నీ ఇద్దరి మధ్య 74 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు.

ఇదే ఓవర్లో డివిలియర్స్ ఓ సూపర్ సిక్స్ కొట్టి అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. మణ్‌దీప్ స్థానంలో క్రీజులోకొచ్చిన కార్తీక్.. బిన్నీని ఒకే ఓవర్లో 6, 4, 4 కొట్టినా, ఇదే ఓవర్లో పరుగు తీయడంలో సమన్వయలోపంతో డివిలియర్స్ రనౌటయ్యాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+