ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)8వ ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ ఆటతీరుపై అసంతృత్తితో ఉన్న సచిన్ టెండూల్కర్ వారికి సలహా ఇచ్చాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు)పై మాత్రమే గెలిచి, మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
దీంతో పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ చివరన ఉంది. ఐపీఎల్‌లో భాగంగా ఈరోజు ముంబై జట్టు సొంత మైదానం వాంఖెడెలో సన్ రైజర్స్‌తో తలపనుంది. ముంబై ఇండియన్స్ జట్టు ఐకాన్‌గా ఉన్న సచిన్ టెండూల్కర్ ఈ మ్యాచ్‌కి ముందు ఆటగాళ్లలో సూర్ఫినింపుతూ కొన్ని మాటలను చెప్పినట్లు తెలుస్తోంది.

శుక్రవారం (ఏప్రిల్ 24)న సచిన్ టెండూల్కర్ తన 42వ పుట్టినరోజుని జరుపుకున్న విషయం తెలిసిందే. తన పుట్టినరోజు వేడుకలో సచిన్ ముంబై ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడారు. ' ప్రతి ఆటలోనూ బంపీ రైడ్స్ ఉంటాయి. ఛాలెంజెస్ ఉంటాయి. మీకున్న అడ్డంకులను అధిగమించినప్పుడే, మీరు అపారమైన సంతృప్తి ఇస్తుంది' అని చెప్పారు.
'పరిష్కారం కోసం ప్రయత్నించండి, సమస్యలు కాదు. మీ కెరీర్ చివరి రోజు వరకు సమస్యలు ఉంటాయి. గేమ్‌ను ఆనందించండి. ఎల్లప్పుడూ పాజిటివ్‌గా ఉండండి ఫలితాలు అవే వస్తాయి.' అని సచిన్ రోహిత్ శర్మ సారధ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టుకు గీతోపదేశం చేశారు.
శుక్రవారం రాత్రి జరుపుకున్న పార్టీ గురించి కొన్ని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేశారు. దానికి సంబంధించిన ట్వీట్స్‌ను చూడండి.