పుణే: ఏపీఎల్ పాయంట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో, రాజస్థాన్ రాయల్స్... బెంగళూరు రాయల్ చాలెంజర్స్ చేతిలో ఓడింది. తద్వారా బెంగళూరు రెండో క్వాలిఫయర్‌కు అర్హ త సంపాదించింది.
మొదటి క్వాలిఫయర్‌లో గెలిచిన ముంబై ఇండియన్స్ ఫైనల్‌కు దూసుకెళ్లగా, ఓటమిపాలైన చెన్నై సూపర్ కింగ్స్ శుక్రవారం జరిగే రెండో క్వాలిఫయర్‌లో బెంగళూరును ఢీ కొంటుంది. ఎలిమినేటర్‌లో 181 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించలేకపోయన రాజస్థాన్ ఒక ఓవర్ మిగిలి ఉండగానే, 109 పరుగులకు ఆలౌటై, 71 పరుగుల తేడాతో ఓడింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 180 పరుగులు సాధించింది. డివిలియర్స్, మన్‌దీప్ సింగ్ హాఫ్ సెంచరీలు జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును అందించాయ. హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్ (27), కెప్టెన్ విరాట్ కోహ్లీ (12) తక్కువ స్కోర్లకే అవుటయ్యారు.
డివిలియర్స్, మన్‌దీప్ మూడో వికెట్‌కు 113 పరుగులు జోడించారు. డివిల్లియర్స్ 38 బంతుల్లో66 పరుగులు చేశాడు. మన్ దీప్ 54 పరు గులు చేశాడు. విజయానికి 181 పరుగులు చేయాల్సివుండగా, మొదటి వికెట్‌ను 14 పరు గుల వద్ద షేన్ వాట్సన్ రూపంలో కోల్పోయన రాజస్థాన్ ఆ తర్వాత కోలుకోలేక పోయంది.
ఓపెనర్ ఆజింక్య రహానే (42) కొంత సేపు పోరాడినప్పటికీ ఫలితం లేకపోయంది. శాంసన్ (5), స్టీవెన్ స్మిత్ (12), కరుణ్ నాయర్ (12), జేమ్స్ ఫాల్క్‌నెర్ (4) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. స్టువర్ట్ బిన్నీ పరు గుల ఖాతా తెరవకుండానే రనౌట్ కావడంతో రాజస్థాన్ విజయావకాశాలకు తెరపడింది. మోరిస్ (0), దీపక్ హూడా (11), ధవళ్ కులకర్ణి (3) కూడా త్వరగా అవుట్‌కావడంతో 19 ఓవర్లలో 109 పరుగులకే రాజస్థాన్ ఆలౌటైంది.