For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్యాట్ వదిలి క్రిస్ గేల్ చిందు: పంజాబ్ ఔట్, అత్యల్ప స్కోర్

By Srinivas

బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం సిక్స్‌లు, ఫోర్లతో 100 కొట్టాడు. అతను 57 బంతుల్లో 117 పరుగులు చేశారు. గేల్‌కు తోడుగా డివిల్లియర్స్ రెచ్చిపోవడంతో పంజాబ్ 138 పరుగుల తేడాతో ప్లేఆఫ్‌కు దూరమైన మొదటి జట్టిగా నిలిచింది.

బెంగళూరును ఓడించేందుకు 227 పరుగులు చేయాల్సిన పంజాబ్ 88 పరుగులకే ఆలౌటై ఐపీఎల్లోనే తన అత్యల్ప స్కోరును నమోదు చేసింది. గతంలో ఎన్నడూ పంజాబ్ ఇంత తక్కువ స్కోరుకు అలౌట్ కాలేదు.

ఐపీఎల్ చరిత్రలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండో భారీ విజయాన్ని నమోదు చేసింది. కింగ్స్ ఎలెవన్పంజాబ్‌ను 138 పరుగుల తేడాతో ఓడించింది. 2008లో బెంగళూరు పైనే కోల్‌కతా నైట్ రైడర్స్ 140 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. ఇప్పుడు అదే బెంగళూరు 138 పరుగుల తేడాతో పంజాబ్‌ను ఓడించి రెండో భారీ గెలుపు సాధించింది.

IPL 2015: RCB decimate Kings XI Punjab, win by 138 runs

మూడో స్థానం కూడా ఇదే జట్టుది కావడం విశేషం. 2013లో అప్పటి పుణే వారియర్స్‌పై 130 పరుగుల తేడాతో గెలిచింది. 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో గెలుపొందిన జట్లలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (2011లో బెంగళూరుపై 111 పరుగు తేడా), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (2008లో ముంబయి ఇండియన్స్‌పై 105 పరుగుల తేడా) ఉన్నాయి.

గేల్ అసాధారణ ఇన్నింగ్స్ బెంగళూరుకు భారీ స్కోరు అందించింది. (32), డివిలియర్స్ 24 బంతుల్లో 47నాటౌట్ సమయోచిత బ్యాటింగ్ కూడా తోడుకావడంతో, తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లకు 226 పరుగుల భారీ స్కోరు చేసింది.

2013లో, అప్పట్లో ఐపీఎల్ ఫ్రాంచైజీగా ఉన్న పుణే వారియర్స్‌పై బెంగళూరు 5 వికెట్లకు 263 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు అదే. ఆ జట్టుకు బుధవారం నాటి 226 పరుగులు రెండో అత్యధిక స్కోరు. భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన పంజాబ్ ఇంకా 38 బంతులు మిగిలి ఉండగానే, 88 పరుగులకే కుప్పకూలింది. చేధించాల్సిన లక్ష్యం భారీగా ఉండటంతో పంజాబ్ ఒత్తిడికి గురయిందని చెప్పొచ్చు.

గేల్ సెంచరీ చేసిన సమయంలో బ్యాట్ వదిలి డ్యాన్స్ చేశాడు. అతను కొట్టిన పలు బంతులు పైకప్పును తాకాయి. గేల్ 22 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 57 బంతుల్లో 117 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో అనురీత్ ఒక్కడే ఎక్కువగా పరుగులు ఇవ్వలేదు. అతను 4 ఓవర్లు వేసి 25 పరుగులే ఇచ్చాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+