న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్: బెంగుళూరులో RCB-SRH మ్యాచ్‌, వర్షం అడ్డంకిగా మారనుందా?

By Nageswara Rao

బెంగుళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో ఈరోజు రాత్రి 7 గంటలకు జరగనున్న ఈ మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

వాతావరణ శాఖ అధికారులను సంప్రదించగా వర్షం సూచనలు ఉన్నాయని తెలపడంతో మ్యాచ్‌ను 8 గంటలకు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ ప్రారంభానికి అరగంట ముందు టాస్ వేయనున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ 7 గంటలకు ప్రారంభించాల్సి ఉంది.

IPL 2015: Rain threat over RCB-SRH match in Bengaluru

గత రెండు రోజులుగా బెంగుళూరులో సాయంత్రం వర్షాలు పడుతుంటడంతో, సోమవారం సాయంత్రం కూడా వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు జరగనున్న మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్‌కు సొంత మైదానంలో తొలి మ్యాచ్. ఏప్రిల్ 11న కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరికి మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తాపై బెంగుళూరు 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.

20 ఓవర్ల మ్యాచ్ కావడంతో అధికారులు, మైదాన నిపుణలు పెద్దగా వర్ష ప్రభావం మ్యాచ్‌పై ఉండదని భావిస్తున్నారు. ఒకవేళ వర్షం పడితే మ్యాచ్‌ని కుదించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X