న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో ముంబై ఇండియన్స్ తలపడని మ్యాచ్‌లో అంఫైర్లకు వ్యతిరేకంగా నోటికి ప్లాస్టర్ వేసుకొని నిరసన తెలిపిన ముంబై ఇండియన్స్ ఆటగాడు కీరన్ పొలార్డ్‌ను ఐపీఎల్ నుంచి ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు నిషేధించాలని టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అన్నారు.
ఏప్రిల్ 19 (ఆదివారం)నాడు బెంగుళూరు Vs ముంబై ఇండియన్స్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్‌తో ముచ్చటిస్తోన్న కీరన్ పొలార్డ్‌ను మైదానంలో ఉన్న అంఫైర్లు మందలించిన సంగతి తెలిసిందే. ఇందుకు నిరసనగా కీరన్ పొలార్డ్ డగౌట్‌కు వెళ్లి నోటికి ప్లాస్టర్ వేసుకొని వచ్చి నిరసన తెలిపిన సంగతి తెలిసిందే.

ఈ సంఘటనపై చాలా మంది ఫన్నీగా ఉందంటూ సమర్ధించారు. ముంబై ఇండియన్స్ జట్టు సపోర్టింగ్ స్టాప్‌తో పాటు. జట్టులోని ఆటగాడు హార్భజన్ సింగ్ కూడా పొలార్డ్ నిరసనను సమర్ధించిన సంగతి తెలిసిందే. గురువారం న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ముంబై ఇండియన్స్ Vs ఢిల్లీ డేర్ డెవిల్స్ మ్యాచ్ సందర్భంగా న్యూజిలాండ్ మాజీ ఆటగాడు సైమన్ డౌల్ మ్యాచ్‌కి మందు మాట్లాడుతూ ఐపీఎల్ నుంచి పొలార్డ్‌ను ఒకటి లేదా రెండు మ్యాచ్‌లకు నిషేధించాలని చెప్పాడు.
ఇదే సందర్భంలో సోని మ్యాక్స్ టీవి స్డూడియోలో వ్యాఖ్యాతగా ఉన్న సునీల్ గవాస్కర్ కూడా 'అవును సైమన్ డౌల్ చేసిన వ్యాఖ్యలకు తాను పూర్తిగా మద్దతిస్తున్నాను' అని అన్నారు. ముంబై ఇండియన్స్ జట్టు మేనేజ్‌మెంట్ అంపైర్లను తప్పుబడుతుంటే, అంఫైర్లు చెప్పని దాంట్లో ఎలాంటి తప్పులేదని సునీల్ గవాస్కర్ అన్నారు.