Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2015: ఫ్లే‌ఆఫ్స్‌లో ఎవరెవరు ఎవరితో, వేదికలు, షెడ్యూల్

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 56 మ్యాచ్‌ల తర్వాత ఫ్లేఆఫ్స్‌కు ఏయే జట్లు అర్హత సాధించాయో తెలిసింది. ఐపీఎల్ 8వ ఎడిషన్ తొలి నుంచి ఎలాంటి వివాదాలు లేకుండా ఉత్కంఠ భరితంగా సాగింది.

ఈ సీజన్‌లో లీగ్ దశలో ఆదివారం నాడు జరిగిన ఫైనల్ వరకూ ప్లేఆఫ్‌ బెర్తులు తేలిపోలేదంటే టోర్నీ ఎంత రసవత్తరంగా సాగిందో అర్ధం చేసుకోవచ్చు. చివరి లీగ్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ (14)ను చిత్తు చేసిన ముంబై నేరుగా పాయింట్ల పట్టికలో రెండో స్ధానం సంపాదించి ప్లే‌ఆఫ్‌కు చేరుకుంది.

Playoffs' teams, venues and schedule

అయితే ముంబై, బెంగళూరు, రాజస్థాన్‌ సమాన పాయింట్లతో ఉన్నప్పటికీ ఎక్కువ విజయాలు (8) సాధించిన రోహిత్‌సేన పట్టికలో రెండో స్థానం సాధించింది. 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి అందరికంటే ముందుగా ప్లేఆఫ్‌కు చేరుకుంది.

కోల్‌కతాను ఓడించి రాజస్థాన్‌ 16 పాయింట్లతో నాల్గవ స్ధానాన్ని దక్కించుకుంది. ఇక ఢిల్లీతో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో బెంగళూరు 16 పాయింట్లతో ప్లేఆఫ్‌కు చేరుకుంది. బెంగళూరు మెరుగైన రన్‌రేట్‌తో మూడో స్థానంలో నిలువగా, రాయల్స్‌ నాలుగో స్థానం దక్కించుకుంది.

టోర్నమెంట్లో దక్కించుకోవడం ఎంత ముఖ్యమో పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలవడం కూడా అంతే ముఖ్యం. క్వాలిఫయర్‌-1లో ఈ రెండు జట్లు తలపడతాయి. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరితే ఓడిన జట్టుకు మరో చాన్స్‌ ఉంటుంది.

ఐపీఎల్‌లో మే 19 నుంచి ఫ్లే‌ఆఫ్స్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. తొలి క్వాలిఫయర్‌ 1 మ్యాచ్ ముంబైలో జరగనుంది. ఐపీఎల్‌లో ఇక నాలుగు మ్యాచ్‌లే మిగిలున్నాయి. మే 24న పైనల్ మ్యాచ్‌ని కోల్‌కత్తాలో ఆడతారు.

లీగ్ దశ ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో స్ధానాలు:

* 1. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) - 18 పాయింట్లు
* 2. ముంబై ఇండియన్స్ (MI) - 16
* 3. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB) - 16
* 4. రాజస్ధాన్ రాయల్స్ (RR) - 16
* 5. కోల్ కత్తా నైట్ రైడర్స్ (KKR) - 15
* 6. సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) - 14
* 7. ఢిల్లీ డేర్ డెవిల్స్ (DD) - 11
* 8. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (KXIP) - 6

Playoffs' teams, venues and schedule

ఐపీఎల్‌లో ఫ్లే‌ఆఫ్స్ షెడ్యూల్ సమాచారం:


మే 19: క్వాలిఫయర్‌ 1 (అన్ని మ్యాచ్‌లు రా. 8 గం నుంచి)
చెన్నై సూపర్ కింగ్స్ Vs ముంబై ఇండియన్స్
వాంఖడె స్టేడియం (ముంబై)
రిజర్వ్ డే: మే 20


మే 20: ఎలిమినేటర్‌
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు Vs రాజస్ధాన్ రాయల్స్
ఎమ్‌సీఏ అంతర్జాతీయ స్టేడియం, పూణే
రిజర్వ్ డే లేదు


మే 22: క్వాలిఫయర్‌ 2
క్వాలిఫయిర్ 1లో ఓడిన జట్టు Vs ఎలిమినేటర్‌‌లో గెలిచిన జట్టు
జేఎస్సీఏ అంతర్జాతీయ స్టేడియం కాంప్లెక్స్, రాంచీ
రిజర్వ డే లేదు


మే 24: ఫైనల్‌
క్వాలిఫయిర్ 1లో గెలిచిన జట్టు Vs క్వాలిఫయిర్ 2లో గెలిచిన జట్టు
ఈడెన్ గార్డెన్స్, కోల్‌కత్తా
రిజర్వ్ డే: మే 25

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+