Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ చరిత్రలో ఇది రెండోసారి: ఏ జట్టు కూడా 20 పాయింట్లు పొందలేదు...!

బెంగుళూరు: పాయింట్ల పట్టకలో అగ్రస్ధానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో అధ్భుత విజయం సాధించింది ఢిల్లీ డేర్ డెవిల్స్. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 8వ ఎడిషన్‌లో ఏ ఒక్క జట్టు కూడా పాయింట్ల పట్టికలో 20 పాయింట్లు సాధించలేక పోవడం విశేషం.

పాయంట్ల పట్టికలో 16 పాయింట్లతో అగ్రస్ధానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌కి ఒకే ఒక్క మ్యాచ్ మిగిలుంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే, మరో రెండు పాయింట్లు సాధించి 18 పాయింట్లతో పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతుంది.

ఐపీఎల్‌లో ఢిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ 15 పాయింట్లతో రెండో స్ధానంలో ఉంది. కోల్‌కత్తాకి కూడా రెండు మ్యాచ్‌లు మిగిలున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో కోల్‌క్తతా విజయం సాధించే నాలుగు పాయింట్లతో 19 పాయింట్లకు చేరుకుంటుంది.

 IPL 2015: No team gets to 20 points, 2nd time in IPL history

ఇక 13 పాయింట్లతో మూడో స్ధానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు టోర్నమెంట్లో ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో బెంగుళూరు విజయం సాధిస్తే 19 పాయింట్లకు చేరుతుంది. 14 పాయింట్లతో ఆ తర్వాతి స్ధానంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌ కూడా మిగతా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే, 18 పాయింట్లు సాధిస్తుంది.

ఐపీఎల్ టోర్నమెంట్లో ప్లేఆఫ్స్ బరిలో ఉన్న మిగతా జట్లు రాజస్దాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ కూడా 16 పాయింట్లు మాత్రమే సాధించగలుగుతాయి. ఐపీఎల్ 8వ ఎడిషన్‌లో 49 మ్యాచ్‌లు అయినా ఇప్పటి వరకు ఏ ఒక్క జట్టు కూడా ప్లే ఆఫ్స్‌లో చోటు దక్కించుకోలేక పోవడం విశేషం.

ఐపీఎల్ టోర్నమెంట్‌లో ఇలా ఏ ఒక్క జట్టు కూడా 20 పాయింట్లు సాధించలేకపోవడం ఇది రెండోసారి. 2011లో పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉన్న రాజస్ధాన్ రాయల్స్ జట్టు 19 పాయింట్లను సాధించింది.

ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో నిలిచిన జట్లు:

IPL 2008: రాజస్ధాన్ రాయల్స్ (22 points)
IPL 2009: ఢిల్లీ డేర్ డెవిల్స్ (20 points)
IPL 2010: ముంబై ఇండియన్స్ (20 points)
IPL 2012: ఢిల్లీ డేర్ డెవిల్స్ (22 points)
IPL 2013: చెన్నై సూపర్ కింగ్స్ (22 points)
IPL 2014: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (22 points)

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+