అహ్మాదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, రాజస్ధాన్ రాయల్స్ జట్టుతో మంగళవారం తలపడనుంది. ఐపీఎల్ 8వ ఎడిషన్‌లో ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు మూడోది. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమికి చవిచూడగా, రాజస్ధాన్ రాయల్స్ రెండు వరుస విజయాలతో దూసుకుపోతుంది.
ఐపీఎల్‌లో 2008 నుంచి ముంబై ఇండియన్స్, రాజస్ధాన్ రాయల్స్‌తో తలపడిన మ్యాచ్‌ల్లో ముంబై 8 సార్లు గెలుపొందగా, రాజస్ధాన్ ఐదు సార్లు గెలుపొందింది. ఒక మ్యాచ్ రద్దైంది. ఐపీఎల్‌లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్ లోని సర్ధార్ పటేల్ స్టేడియంలో రాజస్ధాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.

* 2008లో నవీ ముంబైలో జరిగిన మ్యాచ్‌లో రాజస్ధాన్‌పై ముంబై 7 వికెట్ల తేడాతో గెలుపు [RR 103 in 16.2 overs, MI 104/3 in 15.1 overs]
* 200లో జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో ముంబైపై రాజస్ధాన్ 5 వికెట్ల తేడాతో గెలుపు [MI 145/7 in 20 overs, RR 146/5 in 20 overs]
* 2009లో ముంబై Vs రాజస్ధాన్ మ్యాచ్ రద్దైంది.
* 2010లో ముంబైలో జరిగిన మ్యాచ్‌లో రాజస్ధాన్‌పై ముంబై 4 పరుగుల తేడాతో గెలుపు [MI 212/6 in 20 overs, RR 208/7 in 20 overs]
* 2010లో జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్ధాన్‌పై ముంబై 37 పరుగుల తేడాతో గెలుపు [MI 174/5 in 20 overs, RR 137/8 in 20 overs]
* 2011లో జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో ముంబైపై రాజస్ధాన్ 7 వికెట్ల తేడాతో గెలుపు [MI 94/8 in 20 overs, RR 95/3 in 18.1 overs]
* 2011లో ముంబైలో జరిగిన మ్యాచ్‌లో ముంబైపై రాజస్ధాన్ 10 వికెట్ల తేడాతో గెలుపు [MI 133/5 in 20 overs, RR 134/0 in 13.1 overs]
* 2012లో ముంబైలో జరిగిన మ్యాచ్‌లో రాజస్ధాన్‌పై ముంబై 27 పరుగుల తేడాతో గెలుపు [MI 197/6 in 20 overs, RR 170 in 19.4 overs]
* 2012లో జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్ధాన్‌పై ముంబై 10 వికెట్ల తేడాతో గెలుపు [RR 162/6 in 20 overs, MI 163/0 in 18 overs]
* 2013లో ముంబైలో జరిగిన మ్యాచ్‌లో రాజస్ధాన్‌పై ముంబై 14 పరుగుల తేడాతో గెలుపు [MI 166/8 in 20 overs, RR 152/7 in 20 overs]
* 2013లో జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో ముంబైపై రాజస్ధాన్ 87 పరుగుల తేడాతో గెలుపు [RR 179/3 in 20 overs, MI 92 in 18.2 overs]
* 2014లో అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్ధాన్‌పై ముంబై 25 పరుగుల తేడాతో గెలుపు [MI 178/3 in 20 overs, RR 153/8 in 20 overs]
* 2014లో ముంబైలో జరిగిన మ్యాచ్‌లో రాజస్ధాన్‌పై ముంబై 5 వికెట్ల తేడాతో గెలుపు [RR 189/4 in 20 overs, MI 195/5 in 14.4 overs]