Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపిఎల్ 8: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు జరిమానా

బెంగళూరు: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు 12 లక్షల రూపాయల జరిమానా పడింది. ఆదివారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌తో జరిగిన మ్యాచులో స్లో ఓవర్ రేట్‌కు గాను ఆ జరిమానా పడింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 8లో భాగంగా ఆదివారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌తో మ్యాచు జరిగింది. ఈ మ్యాచులో ముంబై ఇండియన్స్ స్లో ఓవర్ రేటుకు గాను రోహిత్ శర్మకు జరిమానా పడింది.

IPL 2015: MI captain Rohit Sharma fined Rs 12 lakh

ఈ సీజన్‌లో రోహిత్ శర్మకు ఇదే మొదటి తప్పిదం. ఐపియల్ ప్రవర్తనా నియమావళికి సంబంధించి స్లో ఓవర్ రేటు తప్పిదమే అవుతుంది. దాంతో రోహిత్ శర్మను 12 లక్షల రూపాయల జరిమానాతో వదిలేసినట్లు ఐపిఎల్ మీడియా అడ్వయిజరీ సోమవారంనాడు తెలిపింది.

ఆదివారం రాత్రి జరిగిన మ్యాచులో రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్టును ఓడించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+