Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్: రాణించిన రాయుడు, గెలిచిన ముంబై (ఫోటోలు)

ముంబై: ఐపీఎల్ టోర్నమెంట్లో వరుసగా జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయం. ఫ్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతున్న తరుణంలో, ఏ మాత్రం నిరాశకు లోనవకుండా ముంబై జట్టు హ్యాట్రిక్ విజయాలతో సత్తా చాటింది. ఇప్పుడు వరుసగా నాల్గవ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

మంగళవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లతో గెలుపొంది లీగ్‌లో 10 పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ రోహిత్ శర్ మ46, అంబటి రాయుడు 49 నాటౌట్, పొలార్డ్ 26 నాటౌట్ పరుగులతో 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

ఢిల్లీ డేర్ డెవిల్స్ బౌలర్లలో కల్టర్ నైల్ 2, జహీర్, మిశ్రా, మాథ్యూస్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ యువరాజ్ సింగ్ (44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57) అర్ధసెంచరీ సాధించాడు. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది.

రాణించిన రాయుడు, గెలిచిన ముంబై

రాణించిన రాయుడు, గెలిచిన ముంబై

కెప్టెన్ జేపీ డుమిని (19 బంతుల్లో 28) కూడా ధాటిగా ఆడాడు. ఓపెనర్ మయాంక్ (0) డకౌటవగా, శ్రేయాస్ అయ్యర్ 19, జాదవ్ 16 పరుగులు చేశారు. సౌరభ్ (13), కల్టర్ నైల్ (3) నాటౌట్‌గా నిలిచారు.

 రాణించిన రాయుడు, గెలిచిన ముంబై

రాణించిన రాయుడు, గెలిచిన ముంబై

ముంబై బౌలర్లలో స్టార్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ (2/11) ఢిల్లీ పరుగుల వేటను కట్టడి చేసినా, మిగతా బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. మలింగ 2, సుచిత్, పాండ్య ఒక్కో వికెట్ కూల్చారు. హర్భజన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

 రాణించిన రాయుడు, గెలిచిన ముంబై

రాణించిన రాయుడు, గెలిచిన ముంబై

రూ. 16 కోట్ల పారితోషికంతో అత్యంత ఖరీదైన ఆటగాడిగా లీగ్‌లో అడుగుపెట్టిన యువరాజ్ ఈ మ్యాచ్‌తో తన పాత్రకు న్యాయం చేశాడు. తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అభిమానులను రంజింపజేయడంతో పాటు, పరుగులవరద పారించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును కట్టబెట్టాడు.

 రాణించిన రాయుడు, గెలిచిన ముంబై

రాణించిన రాయుడు, గెలిచిన ముంబై

50 పరుగులకే 3 వికెట్లు (మయాంక్, అయ్యర్, డుమిని) కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులో అడుగుపెట్టిన యువరాజ్ తొలుత పరుగుల వేటను నెమ్మదిగానే కొనసాగించాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్ చివరి రెండు బంతులను ఫోర్లుగా తరలించాడు. ఆ తర్వాత బౌండరీలకు ఎక్కువ సమయాన్ని తీసుకున్నాడు.

 రాణించిన రాయుడు, గెలిచిన ముంబై

రాణించిన రాయుడు, గెలిచిన ముంబై

ఓ వికెట్‌ తీసుకొని కట్టడిగా బౌలింగ్ చేస్తున్న మలింగకు 17వ ఓవర్లో చుక్కలు చూపించాడు. హ్యాట్రిక్ ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఆ తర్వాతి ఓవర్లోనే రెండు వరుస సిక్స్‌లు బాది అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ పూర్తి ఇన్నింగ్స్‌లో కేదార్ జాదవ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 28 పరుగులు, మాథ్యూస్‌తో కలిసి ఐదో వికెట్‌కు 24 పరుగులు, తివారీతో కలిసి ఆరో వికెట్‌కు 20 బంతుల్లోనే 41 పరుగులు రాబట్టాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+