న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బౌలర్లు విఫలం: చెన్నైపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి

By Pratap

చెన్నై: బౌలర్ల వైఫల్యం కారణంగా సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్‌పై ఘోర ఓటమిని చవి చూసింది. చెన్నైపై హైదరాబాద్ 45 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారు. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. కానే విలియమ్స్ 18 బంతుల్లో 26 పరుగులు చేసి నాటవుట్‌గా మిగిలాడు. విలియమ్స్‌ను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దింపి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదేమో. చైన్నై బౌలర్లలో మోహిత్ శర్మ, బ్రేవో రెండేసి వికెట్లు తీసుకోగా, ఈశ్వర్ పాండే, అశ్విన్ తలో వికెట్ తీసుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇది వరుసగా రెండో విజయం. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన ఈ ఒక్క మ్యాచులో ఓడిపోయింది.

చెన్నై సూపర్ కింగ్స్ తన ముందు ఉంచిన 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 30 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతూ శిఖర్ ధావన్ మోహిత్ శర్మకు దొరికిపోయాడు. ధావన్ 18 బంతుల్లో 26 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ మోహిత్ శర్మ మరో వికెట్ తీశాడు. రాహుల్ శర్మ ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో హైదరాబాద్ 46 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.

సన్ రైజర్స్ హైదరాబాద్ 91 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగులో నామాన్ ఓజా 15 పరుగులు చేసి మోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 114 పరుగుల వద్ద సన్ రైజర్స్ హైదరాబాద్ నాలుగో వికెట్ కోల్పోయింది. డేవిడ్ వార్నర్ ఈశ్వర్ పాండే బౌలింగులో ధాటిగా కొట్టిన బంతిని స్మిత్ బౌండరీ లైన్ వద్ద అద్భుతంగా అందుకున్నాడు. దీంతో వార్నర్ 53 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిరాశతో వెనుదిరిగాడు. 136 పరుగుల వద్ద సన్ రైజర్స్ హైదరాబాద్ ఐదో వికెట్ కోల్పోయింది. రవి బొపారా 15 బంతుల్లో 22 పరుగులు చేసి బ్రేవో బౌలింగులో అవుటయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ 150 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. కర్ణ్ శర్మ నాలుగు పరుగులు మాత్రమే చేసి బ్రేవో బౌలింగులో అవుటయ్యాడు. సురేష్ రైనా అద్భుతమైన క్యాచ్ పట్టడం ద్వారా అతను పెవిలియన్ దారి పట్టాల్సి వచ్చింది.

సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ మెక్‌కుల్లం, మహేంద్ర సింగ్ దోనీ ఉతికి ఆరేశారు. ధోనీ 29 బంతుల్లో 53 పరుగులు చేసి బౌల్ట్ చివరి ఓవరు బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వెంటనే రవీంద్ర జడేజా పరుగులేమీ చేయకుండా రన్నవుట్ అయ్యాడు. మెక్‌రుల్లం 56 బంతుల్లో సెంచరీ చేశాడు. ధోనీ, మెక్‌కుల్లం దూకుడుతో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. విజయానికి హైదరాబాద్ 210 పరుగులు చేయాల్సి ఉంటుంది. చెన్నై బ్యాటింగ్ ధాటికి సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు బేజారెత్తారు. బౌల్ట్‌కు మాత్రమే ఒక్క వికెట్ దక్కింది. మిగతా ముగ్గురు ఆటగాళ్లు కూడా రన్నవుట్ అయ్యారు.

సన్ రైజర్స్ బౌలర్లను చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ మెక్‌కుల్లం ఉతికి ఆరేశాడు. కాగా, సురేష్ రైనా మరోసారి విఫలమయ్యాడు. 14 పరుగులు చేసి అతను రన్నవుట్ అయ్యాడు. కాగా, చెన్నై 135 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.

సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడుతున్నారు. అయితే, చివరకు సన్ రైజర్స్‌కు ఓ వికెట్ దక్కింది. 75 పరుగుల వద్ద చెన్నై తొలి వికెట్ కోల్పోయింది. స్మిత్ 27 పరుగులు చేసి రన్నవుట్ అయ్యాడు.

ఐపియల్ ట్వంటీ20 టోర్నమెంటులో భాగంగా జరిగిన శనివారంనాటి మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

తొలి మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుపై విజయం సాధించింది. కాగా, సన్ రైజర్స్ తన తొలి మ్యాచ్ ఆడుతోంది.

IPL 2015 Match Report: CSK opt to bat first against SRH

చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మోహిత్ శర్మ, బ్రెండన్ మెక్‌కుల్లం, డ్వైన్ బ్రేవో, డ్వైన్ స్మిత్, ఫఫ్ డూ ప్లెసిస్, మట్ హెన్రీ, శామ్యూల్ బద్రీ, మైకెల్ హస్సీ, కైల్ అబోట్, ఆండ్ర్యూ టై, పవన్ నేగి, ఆశిష్ నెహ్రా, బాబా అపరాజిత్, ఈశ్వర్ పాండే, మిథను మన్హాస్, రోనిత్ మోరే, రాహుల్ శర్మ, అంకుశ్ బైన్స్, ఇర్ఫాన్ పఠాన్, ప్రత్యూష్ సింగ్, ఎకలవ్య ద్వివేది.

సన్ రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), శిఖర్ ధావన్, ఆశిష్ రెడ్డి, భువనేశ్వర్ కుమార్, చామా మిలింద్, డేల్ స్టెయిన్, ఇషాంత్ శర్మ, కర్న్ శర్మ, కెఎల్ రాహుల్, మొయిసిస్ హెన్రిక్స్, నామాన్ ఓజా, పర్వీజ్ రసూల్, రికీ భూయి, ట్రెంట్ బౌల్ట్, ప్రవీణ్ కుమార్, కెవిన్ పీటర్సన్, ఇయోన్ మోర్గాన్, రవి బొపారా, కానే విలియమ్సన్, లక్ష్మీ రతన్ శుక్లా, ప్రశాంత్ పద్మనాభన్, హనుమ విహారి, సిద్ధార్థ్ కౌల్

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X