Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భజ్జీ భళా, అయినా ముంబైకి తప్పని ఓటమి: పంజాబ్ విజయం

ముంబై: కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఒంటి చేత్తో విజయం సాధించాలనే ముంబై ఇండియన్స్ ఆటగాడు హర్భజన్ ఆశలు గల్లంతయ్యాయి. ప్రతి బంతినీ ఫోర్‌గానో, సిక్స్‌గానో బౌండరీ దాటిస్తూ పంజాబ్ బౌలర్లకు అతను దడ పుట్టించాడు. ముంబై ఎదుట పంజాబ్ నిర్దేశించిన లక్ష్యం178 పరుగులు. అయితే టాప్ ఫైవ్ బ్యాట్స్‌మెన్ మరీ ఘోరంగా కేవలం 33 పరుగులే చేయడంతో ముంబై 14 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లకు 60 పరుగులే చేసింది.

అప్పటికి ఒక పరుగుతో క్రీజులో ఉన్న హర్భజన్ భీకరమైన ఇన్నింగ్స్ దెబ్బకు ముంబై 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది. సుచిత్ (34 నాటౌట్)తో కలిసి భజ్జీ 16.21 ఎకానమీరేటుతో సరిగ్గా 100 పరుగులు జోడించాడు. అంతకుముందు సెహ్వాగ్ (19 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 36), విజయ్ (35), బెయిలీ (61నాటౌట్) రాణించడంతో పంజాబ్ 5 వికెట్లకు 177 పరుగులు చేసింది.

Punjab victory

ముంబై ఇండియన్స్ 18 పరుగుల తేడాతో పంజాబ్‌పై ఓటమి పాలైంది. సుచిత్‌ (34 నాటౌట్‌)తో కలిసి భజ్జీ ఏడో వికెట్‌కు 37 బంతుల్లోనే వంద పరుగులు జోడించి పంజాబ్‌కు గుబులు పుట్టించాడు.

పంజాబ్‌ నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యఛేదనలో ముంబై ఓవర్లన్నీ ఆడి ఏడు వికెట్లకు 159 రన్స్‌ చేసింది. పంజాబ్‌ బౌలర్లలో జాన్సన్‌, అక్షర్‌, అనురీత్‌ తలో రెండు వికెట్లు తీశారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+