For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ వ్యూహానికి కోహ్లీ చిత్తు: చెన్నై ఘన విజయం

By Pratap

చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యూహం ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ చిత్తయ్యాడు. సోమవారం జరిగిన ఐపియల్ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ చాలెంజర్స్ బెెంగళూర్‌పై 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. 19.4 ఓవర్లలో బెంగళూర్ 124 పరుగులకే చిత్తయింది. చెన్నై బౌలర్లలో నెహ్రా మూడు వికెట్లు తీసుకున్నాడు. ఈశ్వర్ పాండే, బ్రేవో చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. చాహల్‌కు ఒక్క వికెట్ దక్కింది.

చెన్నై సూపర్ కింగ్స్ తన ముందు ఉంచిన 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ పది పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఐపిఎల్‌లో ఆరంగేట్రం చేసిన మాడిసన్ నాలుగు పరుగులు మాత్రమే చేసి ఈశ్వర్ పాండే బౌలింగులో అవుటయ్యాడు. ఆ తర్వాత రెండో వికెట్‌హా డీ విల్లీర్స్ అవుటయ్యాడు. ఆ వెంటనే 48 పరుగుల స్కోరు వద్ద మన్‌దీప్ సింగ్ పరుగులేమీ చేయకుండా మూడో వికెట్‌గా వెనుదిరిగాడు.

97 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ కష్టాల్లో పడింది. దినేష్ కార్తిక్ 97 పరుగుల వద్ద ఐదో వికెట్‌గా నెహ్రూ బౌలింగులో వెనుదిరిగాడు. అంతకు ముందు విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 48 పరుగులు చేసి రన్నవుట్ అయ్యాడు. ఎంతో నమ్మకం పెట్టుకున్న సర్ఫరాజ్ ఖాన్ తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 111 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. 112 పరుగుల వద్ద బెంగళూర్ ఏడో వికెట్ కోల్పోయింది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌పై మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. చివరి ఓవరులో వికెట్లను కోల్పోతూ చెన్నై పరుగులు రాబట్టలేకపోయింది. చివరి ఓవరులో చెన్నై మూడు వికెట్లు కోల్పోయింది. చివరగా మోహిత్ శర్మ రన్నవుట్ అయ్యాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లు తీయగా, వీస్, పటేల్‌లకు తలా రెండు వికెట్లు వచ్చాయి. చాహల్ ఒక వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌పై ఐపియల్ ట్వంటీ20 మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ 122 పరుగుల వద్ద ఐదు వికెట్లు కోల్పోయింది. సురేష్ రైనా అర్థ సెంచరీ చేసి పటేల్ బౌలింగులో అవుటయ్యాడు. రవీంద్ర జడేజా 3 పరుగులు మాత్రమే చేసి చాహల్ బౌలింగులోనే ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. 139 పరుగుల వద్ద చెన్నై ఆరో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతూ వచ్చిన కెప్టెన్ ధోనీ 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వీస్‌కు దొరికిపోయాడు. 147 పరుగుల వద్ద బ్రేవో రూపంలో చెన్నై ఏడో వికెట్ కోల్పోయింది. ఆ వెనువెంటనే పవన్ నేగీ అవుటయ్యాడు. దీంతో చెన్నై 148 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. పవన్ నేగీ 13 పరుగులు చేసి స్టార్క్ బౌలింగులో అవుటయ్యాడు

రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌పై మ్యాచులో సోమవారం పరుగులేమీ చేయకుండానే చెన్నై సూపర్ కింగ్స్ స్మిత్ వికెట్‌ను కోల్పోయింది. స్టార్క్ బౌలింగులో అతను పరుగులేమీ చేయకుండా వచ్చినదారినే వెనుదిరిగాడు. 34 పరుగుల వద్ద చెన్నై రెండో వికెట్ కోల్పోయింది. బ్రెండన్ మెక్‌కుల్లం 20 పరుగులు చేసి వీస్ బౌలింగులో అవుటయ్యాడు.

విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల్లో భాగంగా ఇరు జట్ల మధ్య సోమవారం చెన్నైలోని ఎం.ఎ చిదంబరం మైదానంలో ట్వంటీ20 మ్యాచ్ ప్రారంభమైంది.

IPL 2015 Match 37: CSK bat first against RCB; Gayle rested

తాను టాస్ గెలిచి ఉంటే బ్యాటింగ్ ఎంచుకుని ఉండేవాడినని విరాట్ కోహ్లీ అన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ అశ్విన్ లేకుండానే మైదానంలోకి దిగింది. వేలి గాయం నుంచి అతను పూర్తిగా కోలుకోలేదు.

కాగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ క్రిస్ గేల్‌కు విశ్రాంతినిచ్చింది. అతని స్థానంలో ఆస్ట్రేలియాకు చెదిన నిక్ మాడిసన్ మైదానంలోకి దిగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు సంబంధించి రోనిత్ మోరే స్తానంలో ఈశ్వర్ పాండే తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. మాడిసన్ ఐపియల్‌లో తొలిసారి మైదానంలోకి దిగుతున్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+