ముంబై: సన్ రైజర్స్ హైదరాాబాద్‌పై ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. లసిత్ మలింగ, మిచెల్ మెక్‌క్లెన్‌ఘాన్ అద్భుత బౌలింగు ప్రదర్శనతో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతులు ఎత్తేసింది. మలింగ కేవలం 23 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. దాంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో కేవలం 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. అప్పటికి ఎనిమిది వికెట్లు కోల్పోయింది.
ఐపియల్ టోర్నోలీ భాగంగా జరుగుతున్న మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాదులో ముంబై ఇండియన్స్ ధాటిగా ఇన్నింగ్సును ప్రారంభించినప్పటికీ చివరలో పెద్దగా రాణించలేకపోయారు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. సన్ రైజర్స్ విజయానికి 158 పరుగులు చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు తీయగా, స్టెయిన్, ప్రవీణ్ కుమార్ రెండేసి వికెట్లు తీశారు. శర్మ ఓ వికెట్ తీసుకున్నాడు.
సన్ రైజర్స్ హైదరాబాదుపై బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. 49 పరుగులకు ముంబై రెండు వికెట్లు కోల్పోయింది. ఆదిలోనే పార్థివ్ పటేల్ వికెట్ కోల్పోయిన ముంబై ఆ తర్వాత ఉన్ముక్త్ చంద్ వికెట్ కోల్పోయింది. ప్రవీణ్ కుమార్ బౌలింగులో ఉన్ముక్త్ చంద్ ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. 24 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ముంబై 108 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. సిమన్స్ అర్థ సెంచరీ (51) చేసి అవుటయ్యాడు. తెలుగు క్రీడాకారుడు అంబటి రాయుడు మరోసారి పేలవమైన ప్రదర్శన కనబరిచాడు. ఏడు పరుగులు మాత్రమే చేసి ప్రవీణ్ కుమార్ బౌలింగులో అవుటయ్యాడు. దీంతో ముంబై 126 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. బ్యాట్‌తో కూడా తడాఖా చూపిస్తున్న హర్భజన్ సింగ్ డకౌట్ అయ్యాడు. దీంతో ముంబై ఇండియన్స్ 128 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. 148 పరుగుల వద్ద ముంబై ఏడో వికెట్‌ను జారవిడుచుకుంది. ఆతర్వాత ఒక్క పరుగు మాత్రమే జోడించి వినయ్ కుమార్ రూపంలో ఎనిమిదో వికెట్‌ను కోల్పోయింది.
సన్ రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ శనివారంనాడు బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు పార్థివ్ పటేల్, లెండిల్ సిమన్స్ దూకుడుగా ఆడుతున్నారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

రెండు జట్లు కూడా రెండేసి మార్పులు చేశాయి. హైదరాబాదు తుది జట్టులోకి మోయిసెస్ హెన్రిక్స్, హనుమ విహారీ వచ్చారు. మంబై ఇండియన్స్ తుది జట్టులోకి జె. సుచిత్, ఆర్ వినయ్ కుమార్ వచ్చారు. హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా స్థానాల్లో వారిద్దరు తుది జట్టులోకి వచ్చారు.
కాగా, ముంబై ఇండియన్స్ 42 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. పార్థివ్ పటేల్ 17 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద స్టెయిన్ బౌలింగులో విహారికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.