Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హైదరాబాద్‌కు గెలుపు ఊరట: కోల్‌కతా ఓటమి

విశాఖపట్నం:డక్ వర్త్స్ లూయిస్ పద్ధతి కోల్‌కతా నైట్ రైడర్స్ కొంప ముంచింది. సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో కోల్‌కతా 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 12 ఓవర్లలో 118 పరుగులు చేయాల్సి ఉండగా కోల్‌కతా నాలుగు వికెట్ల నష్టానికి 101 పరుగులు మాత్రమే చేసింది.

హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చివరి ఓవరు వేశాడు. కోల్‌కతా చివరి 2 బంతులకు 19 పరుగులు చేయాల్సిన స్థితిలో పడింది.

సన్ రైజర్స్ హైదరాబాద్‌పై మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ 35 పరుగుల వద్ద ప్రవీణ్ కుమార్ బౌలింగులో తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ గౌతం గంభీర్ నాలుగు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. మరో వైపు తొలి నుంచి రాబిన్ ఊతప్ప చెలరేగిపోతూ 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హెన్రిక్స్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఊపిరి పీల్చుకుంది. దీంతో 49 పరుగుల వద్ద కోల్‌కతా రెండో వికెట్ కోల్పోయింది. 80 పరుగుల స్కోరు వద్ద కోల్‌కతా మూడో వికెట్ కోల్పోయింది. రవి బొపారా బౌలింగులో రస్సెల్ 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. 19 బంతుల్లో 38 పరుగులు చేయాల్సిన స్థితిలో కోల్‌కతా పడింది.

కోల్‌కతా నైట్ రైడర్స్ 5 బంతులకు 24 పరుగులు చేయాల్సిన స్థితిలో యూసుఫ్ పఠాన్ అవుటయ్యాడు. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ 4 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన స్థితిలో పడింది.

వర్షం తెరిపి ఇవ్వడంతో విశాఖపట్నంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచు తిరిగి ప్రారంభమైంది. వర్షం వల్ల ఆటంకం ఏర్పడడంతో కోల్‌కతా ఛేదించాల్సిన లక్ష్యాన్ని కుదించారు. కోల్‌కతా 12 ఓవర్లలో 118 పరుగులు చేయాల్సి ఉంటుంది.

సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మధ్య ఐపిఎల్ మ్యాచుకు వర్షం ఆటంకంగా మారింది. హైదరాబాద్ తన ముందు ఉంచిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ మైదానంలోకి దిగక ముందే వర్షం ప్రారంభమైంది.

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో బుధవారం జరుగుతున్న మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.

కోల్‌కొతా నైట్ రైడర్స్‌ బౌలర్లను సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ దంచికొట్టారు. దూకుడుగా ఆడుతున్న డేవిడ్ వార్నర్ తన అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత 91 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతను మోర్కెల్ బౌలింగులో అవుటయ్యాడు. దాంతో హైదరాబాద్ 130 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రవి బొపారా రెండు పరుగులు మాత్రమే చేసి మోర్కెల్ బౌలింగులో పెవిలియన్‌కు చేరుకున్నాడు. దాంతో 143 పరుగుల వద్ద హైదరాబాద్ రెండో వికెట్‌ను జారవిడుచుకుంది.

అర్థ సెంచరీ చేసిన తర్వాత శిఖర్ ధావన్ అవుటయ్యాడు. 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతను రస్సెల్ బౌలింగులో అవుటయ్యాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 162 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. హైదరాబాద్ నాలుగో వికెట్ కోల్పోయింది. చివరి ఓవరులో 170 పరుగుల వద్ద 18 పరుగులు చేసి నామాన్ ఓజా ఉమేష్ యాదవ్ బౌలింగులో అవుటయ్యాడు.

ఐపిఎల్ 8లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌పై జరుగుతున్న మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ బుధవారంనాడు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తన సొంత మైదానం విశాఖపట్నంలో ఆడిన రెండు మ్యాచుల్లోనూ నిరాశపరిచింది.

 IPL 2015 Match 19: KKR captain Gambhir opts to chase again

లక్ష్యాన్ని ఛేదించడానికి పూనుకుని కోల్‌తా నైట్ రైడర్స్ మూడు మ్యాచుల్లో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మ్యాచులో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌పై ఓడిపోయింది.

టాస్ గెలువగానే తాము తర్వాత బ్యాటింగ్‌కు దిగుతామని గంభీర్ చెప్పాడు. గత మ్యాచులో ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై కూడా గంభీర్ ఫీల్డింగ్‌నే ఎంచుకున్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+