మొహాలీ:టి-20 క్రికెట్ టోర్నీ నుంచి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ అధికారికంగా గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి వెనుదిరిగింది. శనివారం చెన్నై సూపర్ కింగ్స్ ఎలాంటి సమస్య లేకుండా సునాయాస విజయాన్ని నమోదు చేసింది. 14 మ్యాచ్‌ల్లో 11వ పరాజయంతో పంజాబ్ ఇంటిదారి పట్టింది.
ఆ జట్టు నిర్దేశించిన 131 పరుగుల విజయ లక్ష్యాన్ని చెన్నై మరో 19 బంతులు మిగిలి ఉండగానే చేరుకొని, ఏడు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. ఈ విజయంతో చెన్నై మొత్తం 18 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.
అంతకుముందు, ఐపిఎల్-8లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం జరుగుతున్న మ్యాచులో కింగ్స్ లెవన్ పంజాబ్ నిర్ణీత 20ఓవర్లలో 131 పరుగులు చేసింది. మొదటి నుంచి తడబడుతూ బ్యాటింగ్ చేసిన పంజాబ్.. తక్కువ స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. పంజాబ్ జట్టులో అక్షర్ పటేల్ (29 బంతుల్లో 32, 2ఫోర్లు, 1సిక్స్) రాణించగా మిగితా బ్యాటర్లందరూ చేతులెత్తేశారు.
టాస్ గెలిచి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ జార్జ్ బెయిలీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, టకటకా వికెట్లను కోల్పోతూ పంజాబ్ కష్టాల్లో పడింది. 78 పరుగుల వద్ద పంజాబ్ ఆరో వికెట్ కోల్పోయింది. డేవిడ్ మిల్లర్ 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పవన్ నేగీ బౌలింగులో జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

పంజాబ్ 55 పరుగులకే ఐదు కీలకమైన వికెట్లను కోల్పోయింది. అశ్విన్ స్పిన్ బౌలింగులో క్రీజు బయటకు వచ్చి భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించిన గురుకీరత్ సింగ్ (15) బంతి అందకపోవడంతో స్టంపవుట్ అయ్యాడు. తర్వాత ఓవర్ వేసిన రవీంద్ర జడేజా బౌలింగులో మాక్స్‌వెల్ (6) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
అంతకు ముందు పంజాబ్ ఓపెనర్ వోహ్రా 35 పరుగుల స్కోరు వద్ద నాలుగు పరుగులు చేసి ఆశిష్ నెహ్రాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో ఆరు ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ మూడు వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది. పంజాబ్ కెప్టెన్ జార్జ్ బెయిలీ 31 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఆశిష్ నెహ్రా బౌలింగులో 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతను అవుటయ్యాడు.
పంజాబ్ 16 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. పవన్ నేగీ బౌలింగులో వృద్ధిమాన్ సాహా 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.