Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భూకంప అనుభవం భయంకరమని ట్వీట్ చేసిన కోల్‌కత్తా ఆటగాడు(ట్వీట్స్)

న్యూఢిల్లీ/కోల్‌కత్తా: న్యూఢిల్లీ, కోల్‌కత్తా జట్ల తరుపున ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతున్న క్రికెట్ ఆటగాళ్లు శనివారం (ఏప్రిల్ 25) ఉదయం నాడు భూ ప్రకంపనలను రుచి చూశారు. ఢిల్లీ, కోల్‌కత్తాలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం భూ ప్రకంపం సంభవించింది.

ఉత్తర భారతదేశంలోని న్యూఢిల్లీ, కోల్‌కత్తా, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రెక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.4గా నమోదైనట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. నేపాల్‌లోని భరత్ పూర్‌కు 60 కిలోమీటర్ల దూరంలోని భూమిలోని 11 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

 IPL 2015: KKR players feel 'horrible' earthquake in Kolkata

దీంతో ఉదయం 11.44 గంటల సమయంలో నిమషం 8 సెకన్లపాటు భూమి కంపించినట్లు పేర్కొన్నారు. ఐపీఎల్‌లో భాగంగా ఏప్రిల్ 26న కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు రాజస్ధాన్ రాయల్స్ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో కోల్‌కత్తా నైట్ రైడర్స్ క్రికెటర్లు రాబిన్ ఊతప్ప, కులదీప్ యాదవ్‌లు ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈ భూకంప ప్రభావాన్ని చూసినట్లు ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.

కులదీప్ యాదన్ తన ట్విట్టర్‌లో "చాలా భయంకరంగా ఉంది. నా గుండే వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. కోల్‌కత్తాలో భూకంపాన్ని నేను ఫీలయ్యాను" అంటూ ట్వీట్ చేశాడు. మరో ఆటగాడు రాబిన్ ఊతప్ప తన ట్విట్టర్‌లో భూకంపం తొలి అనుభవం, ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ ట్వీట్ చేశాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+