For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్: యువీ ఒక్కో పరుగుకి ఢిల్లీ ప్రాంఛైజీ ఎన్ని లక్షలు చెల్లించింది..?

By Nageswara Rao

బెంగుళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు యువరాజ్ సింగ్. అయితే వేలంపాటలో తనకు పలికిన ధరకు మాత్రం న్యాయం చేకలేకపోయాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తరుపున ఐపీఎల్‌‌లో ఆడుతున్న యువీ, బెంగుళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌‌‍లో 11 పరుగులు చేశాడు.

ఐపీఎల్ లీగ్ దశలోనే ఢిల్లీ ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 8వ ఎడిషన్‌ వేలంపాటలో రూ. 16 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. గత ఏడాది జరిగిన ఐపీఎల్ వేలం పాటలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కూడా రూ. 14 కోట్లు పెట్టి యువరాజ్ సింగ్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ఆ ఎడిషన్‌కు అది రికార్డు ధర. ఢిల్లీ ప్రాంఛైజీ తరుపున యువీ చేసిన పరుగులను ఒకసారి చూద్దాం. ఒక్కో పరుగుకి ఢిల్లీ ప్రాంఛైజీ ఎంత మొత్తం చెల్లించిందో కూడా చూద్దాం. 33 ఏళ్ల యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ దాదాపుగా ముగిసినట్లే.

అయితే ఐపీఎల్‌లో యువీ హిట్ అవుతాడని భావించారు. అందుకు కారణం ఐపీఎల్ 8వ ఎడిషన్‌కు ముందు యువీ ఆడిన రంజీల్లో వరుసగా మూడు సెంచరీలు సాధించడమే. అయితే అభిమానులు ఆశించిన స్ధాయిలో ఐపీఎల్‌లో యువీ రాణించలేదు.

ఐపీఎల్ 2015లో 13 ఇన్నింగ్స్ (14 మ్యాచ్‌లు) ఆడిన యువరాజ్ సింగ్ 248 పరుగులు చేశాడు. దీంతో యువరాజ్ సింగ్ ఒక్కో పరుగు ఖరీదు రూ. 6.5 లక్షలు (ఖచ్చితంగా రూ. 6,45,161). ఐపీఎల్ 8వ ఎడిషన్‌లో ఏడు ఇన్నింగ్స్ ముగిసే సరికి యువరాజ్ ఒక్కో పరుగు ఖరీదు ఇదే విధంగా ఉంది.

ఆ తర్వాత ఆడిన 6 ఇన్నింగ్స్‌లో యువీ అదే రకమైన ఆట తీరుని ప్రదర్శించాడు. తొలి 7 ఇన్నింగ్స్‌లో 124 పరుగులు సాధిస్తే, ఆ తర్వాత 6 ఇన్నింగ్స్‌లో 124 పరుగులు సాధించాడు. తాను ఆడిన 13 ఇన్నింగ్స్‌లో యువీ కేవలం రెండు అర్ధ సెంచరీలను మాత్రమే సాధించాడు.

ఇక టోర్నమెంట్లో చివరి మ్యాచ్‌గా ఆదివారం నాడు బెంగుళూరుతో ఆడిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ 11 పరుగులు మాత్రమే సాధించాడు. టోర్నమెంట్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 11 పాయంట్లతో 7వ స్ధానం(5 గెలుపు, 8 ఓటమి, 1 మ్యాచ్ ఫలితం తేలలేదు)లో నిలిచింది.

IPL 2015: How many lakhs did each run of Yuvraj Singh cost?

IPL 2015 యువరాజ్ సింగ్ సాధించిన పరుగులు:

* 9 Vs Chennai Super Kings
* 27 Vs Rajasthan Royals
* 54 Vs Kings XI Punjab
* 9 Vs Sunrisers Hyderabad
* 21 Vs Kolkata Knight Riders
* 2 Vs Mumbai Indians
* 2 Vs Royal Challengers Bangalore
* 22 Vs RR
* 57 Vs MI
* 0 Vs KKR
* 2 Vs SRH
* 32 Vs CSK
* 11 Vs RCB

మొత్తం - 210 బంతుల్లో 248 పరుగులు
అత్యధిక స్కోరు - 57
ఫోర్లు - 23
సిక్సులు - 10

బౌలింగ్: 9 ఓవర్లు, 72 పరుగులు, 1 వికెట్ (6 ఇన్నింగ్స్)

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+