Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ డైలీగైడ్: లీగ్‌ దశలో చివరి మ్యాచ్, గెలిచిన జట్టే ప్లే ఆఫ్‌కు

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లీగ్ దశలో ఈరోజు ఉత్కంఠ భరిత మ్యాచ్ జరగబోతోంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్డేడియంలో ఈరోజు జరగబోయే మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ముంబై ఇండియన్స్‌తో తలపడుతుంది.

రెండు జట్లూ ఇప్పటి వరకూ 13 మ్యాచ్‌లాడి పాయింట్ల పట్టికలో 14 పాయింట్లు సాధించాయి. ఈ రోజు జరగబోయే మ్యాచ్‌లో ఏజట్టు గెలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్స్‌లో చోటు దక్కించుకుంటుంది. మరోవైపు ముంబై జట్టు డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతాపై అనూహ్య విజయంతో ప్లే ఆఫ్ రేసులో నిలబడింది.

ఈరోజు జరగబోయే మ్యాచ్‌లో ఫేవరేట్‌గా సన్ రైజర్స్ బరిలోకి దిగుతుంది. వార్నర్, ధావన్, హెన్రిక్స్‌ల ఫామ్‌తో సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తోంది. మే 15న జరిగిన బెంగళూరు మ్యాచ్‌లో అనూహ్య ఓటమిని మినహాయిస్తే సన్‌రైజర్స్ వరుస విజయాలతో జోరు మీదే ఉంది.

ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే సిమ్మన్స్, పొలార్డ్, రోహిత్‌లతో పాటు హార్దిక్ పాండ్యా ఆ జట్టుకు కీలకం. బౌలింగ్‌లో మలింగ, మెక్లీన్‌గన్‌లతో పాటు హర్భజన్ రాణించాల్సి ఉంది. మొత్తం మీద రెండు జట్లూ ఆత్మవిశ్వాసంతో ఉన్న నేపథ్యంలో చివరి లీగ్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది.

IPL 2015 Daily Guide: Match 56 - Sunrisers Hyderabad Vs Mumbai Indians

ఎవరెవరు ఆడుతున్నారు?
సన్ రైజర్స్ హైదరాబాద్ Vs ముంబై ఇండియన్స్


ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయానికి?
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం, ఉప్పల్
మే 17 (ఆదివారం)
సాయంత్రం 8 గంటలకు


భారత్‌లో ఏ టీవి ప్రసారం చేస్తోంది?
సోనీ మ్యాక్స్ (హిందీ కామెంటరీ)
సోనీ సిక్స్ (ఇంగ్లీషు)
సోనీ ఆత్ (బెంగాలీ)
సోనీ కిక్స్ (తమిళం, తెలుగు)


కీలక ఆటగాళ్లు?
సన్ రైజర్స్ హైదరాబాద్ - డేవిడ్ వార్నర్, భువనేశ్వరు కుమార్
ముంబై ఇండియన్స్ - రోహిత్ శర్మ, సిమన్స్, కీరన్ పోలార్డ్, లతీష్ మలింగ


రికార్డు
సన్ రైజర్స్ హైదరాబాద్ - 2
ముంబై ఇండియన్స్ - 3


పాయింట్ల పట్టికలో ప్రస్తుత స్ధానం
సన్ రైజర్స్ హైదరాబాద్ - నెంబర్. 5 (7 గెలుపు, 6 ఓటమి)
ముంబై ఇండియన్స్ - నెంబర్. 6 (7 గెలుపు, 6 ఓటమి)


జట్లు

సన్ రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), శిఖర్ ధావన్, డేల్ స్టెయిన్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, మోజెస్ హెన్రిక్స్, కేఎల్ రాహుల్, పర్వేజ్ రసూల్, నమన్ ఓజా (వికెట్ కీపర్), ఆశిష్ రెడ్డి, రికీభువి, ఛమా మిలింద్, కర్ణ్ శర్మ, కేన్ విలియమ్సన్ కెవిన్ పీటర్సన్, ఇయాన్ మోర్గాన్, రవి బొపారా, ట్రెంట్ బౌల్ట్, ప్రవీణ్ కుమార్, విహారి, ప్రశాంత్ పద్మనాభన్, సిద్దార్థ్ కౌల్, బిపుల్ శర్మ

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), లసిత్ మలింగ, కీరాన్ పొల్లార్డ్, అంబటి రాయుడు (వికెట్కీపర్), హర్భజన్ సింగ్, కోరీ ఆండర్సన్, ఆదిత్య తారే, జస్ప్రీత్ బుంమ్రా, జోష్ హాజల్‌ఉడ్, మార్చాంట్లు డి లాంగే పవన్ సుయాల్, శ్రేయాస్ గోపాల్, లెండిల్ సిమన్స్, ఆరోన్ ఫించ్, ప్రజ్ఞాన్ ఓజా, మిఛెల్ మెక్‌గ్లాన్, అభిమన్యు మిథున్, ఐడెన్ మంచు తుఫాను, అక్షయ్, నితీష్ రానా, సిద్దేశ్ లాడ్, హ్యాడ్రిక్ పాండ్య, జగదీష్ సుజిత్, ఉన్ముక్త్ చంద్, వినయ్ కుమార్, పార్థివ్ పటేల్ (వికెట్ కీపర్).

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+