Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ డైలీ గైడ్: ప్లేఆఫ్స్‌పై కన్నేసిన రాజస్థాన్, వార్నర్ సేన గెలుస్తుందా..?

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ఈరోజు రాజస్ధాన్, హైదరాబాద్‌కు మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్స్‌లో తన స్ధానాన్ని నిలబెట్టుకునేందుకు మార్గం సుగమనం చేసుకోవాలని రాజస్థాన్ రాయల్స్ భావిస్తోంది.

పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ రెండో స్ధానంలో కొనసాగుతోంది. లీగ్ దశలో రాజస్ధాన్‌కు ఇంక మూడు మ్యాచ్‌లే మిగిలున్నాయి. ఈ మూడ్ మ్యాచ్‌ల్లో కనీసం రెండింట్లోనైనా గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ నాలుగు స్ధానాల్లో నిలవాలని చూస్తోంది.

పాయింట్ల పట్టికలో టాప్ నాలుగు స్ధానాల్లో నిలిచిన జట్లే ఫ్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ లీగ్ దశలో ఇప్పటికే 9 మ్యాచ్‌లాడిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఏడో స్ధానంలో కొనసాగుతోంది. సన్ రైజర్స్‌కు ఫ్లే ఆఫ్స్‌లో చోటు దక్కకుండా చూడాలంటే ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం సాధించాల్సి ఉంది.

రాజస్ధాన్ రాయల్స్ ఈరోజు జరగనున్న మ్యాచ్‌ని తన సొంత మైదానంలో కాకుండా ముంబైలోని బ్రాబోర్నే స్డేడియంలో ఆడనుంది. ఈ రోజు జరగనున్న మ్యాచ్‌లో ఫేవరేట్‌గా రాజస్ధాన్ బరిలోకి దిగనుంది.

IPL 2015 Daily Guide: Match 41 - Rajasthan Royals Vs Sunrisers Hyderabad

ఎవరెవరు ఆడుతున్నారు?
రాజస్థాన్ రాయల్స్ Vs సన్ రైజర్స్ హైదరాబాద్


ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయానికి?
బ్రాబౌర్నే స్డేడియం, ముంబై
మే 7 (గురువారం)
సాయంత్రం 4 గంటలకు
సాయంత్రం 8 గంటలకు - కోల్‌కత్తా నైట్ రైడర్స్ Vs ఢిల్లీ డేర్ డెవిల్స్


భారత్‌లో ఏ టీవి ప్రసారం చేస్తోంది?
సోనీ మ్యాక్స్ (హిందీ కామెంటరీ)
సోనీ సిక్స్ (ఇంగ్లీషు)
సోనీ ఆత్ (బెంగాలీ)
సోనీ కిక్స్ (తమిళం, తెలుగు)


కీలక ఆటగాళ్లు?
రాజస్థాన్ రాయల్స్ - అజ్యెంక రహానే, షేన్ వాట్సన్, స్టీవ్ స్మిత్, జేమ్స్ ఫల్కనర్, టిమ్ సౌథీ
సన్ రైజర్స్ హైదరాబాద్ - డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, ట్రెంట్ బౌల్ట్


రికార్డు
రాజస్థాన్ రాయల్స్ - 4
సన్ రైజర్స్ హైదరాబాద్ - 2


పాయింట్ల పట్టికలో ప్రస్తుత స్ధానం
రాజస్థాన్ రాయల్స్ - నెంబర్. 2 (6 గెలుపు, 3 ఓటమి, 2 ఫలితం తేలలేదు)
సన్ రైజర్స్ హైదరాబాద్ - నెంబర్. 7 (4 గెలుపు, 5 ఓటమి)


జట్లు

రాజస్థాన్ రాయల్స్: షేన్ వాట్సన్ (కెప్టెన్), స్టువర్ట్ బిన్నీ, జేమ్స్ ఫాల్క్నర్, అజింక్య రహానే, సంజూ శామ్సన్ (వికెట్ కీపర్), స్టీవ్ స్మిత్, రజత్ భాటియా, టిమ్ సౌథీ, ధవళ్ కులకర్ణి, అభిషేక్ నాయర్, కేన్ రిచర్డ్సన్, బెన్ కట్టింగ్, కరుణ్ నాయర్, దీపక్ హుడా , దిశాంత్ యాగ్నిక్, విక్రమ్జీత్ మాలిక్, అంకిత్ శర్మ, రాహుల్ తెవాతియాతోపాటు తంబె, క్రిస్ మోరిస్, దినేష్ సలుంఖే, జువాన్ థెరాన్, ప్రదీప్ సాహు, బరిందర్ శరణ్, సాగర్ త్రివేది.

సన్ రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), శిఖర్ ధావన్, డేల్ స్టెయిన్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, మోజెస్ హెన్రిక్స్, కేఎల్ రాహుల్, పర్వేజ్ రసూల్, నమన్ ఓజా (వికెట్ కీపర్), ఆశిష్ రెడ్డి, రికీభువి, ఛమా మిలింద్, కర్ణ్ శర్మ, కేన్ విలియమ్సన్ కెవిన్ పీటర్సన్, ఇయాన్ మోర్గాన్, రవి బొపారా, ట్రెంట్ బౌల్ట్, ప్రవీణ్ కుమార్, విహారి, ప్రశాంత్ పద్మనాభన్, సిద్దార్థ్ కౌల్, బిపుల్ శర్మ

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+