For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ డైలీ గైడ్: చెన్నైపై కోల్‌కత్తా ప్రతీకారం తీర్చుకుంటుందా?

By Nageswara Rao

కోల్‌కత్తా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ఈరోజు రెండు సార్లు ఛాంపియన్‌గా అవతరించిన చెన్నై సూపర్ కింగ్స్ Vs కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య కోల్‌కత్తా లోని ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కత్తాపై చెన్నై గెలిస్తే ఫ్లే ఆఫ్స్‌లో చోట్ దక్కించుకున్నట్లే.

6 మ్యాచ్‌ల్లో విజయం సాధించడంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో మొదటి స్ధానంలో ఉంది. 3 విజయాలతో కోల్‌కత్తా జట్టు నాల్గవ స్ధానంలో ఉంది. రెండు రోజుల క్రితం చెన్నైలోని ఎమ్ చిదంబరం స్డేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తాపై 134 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది.

ఈ మ్యాచ్ కోల్‌కత్తా సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుండటంతో ధోనిసేనపై ప్రతీకారం తీర్చుకునే దిశగా కోల్‌కత్తా జట్టు ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటి వరకు ఆడిన టోర్నమెంట్లో చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయక పోవడం విశేషం.

కోల్‌కత్తా జట్టుకు మరో ఎదురు దెబ్బ. ఆ జట్టు బౌలర్ సునీల్ నరైన్ ఆఫ్ స్నిన్ బౌలింగుపై బిసిసిఐ నిషేధం విధించింది. ఈ మేరకు బిసిసిఐ బుధవారం ఓ ప్రకటన చేసింది. బిసిసిఐ నిర్వహించే ఐపియల్‌ సహా అన్ని మ్యాచుల్లోనూ నరైన్ ఆఫ్ స్పిన్నర్స్ వేయడాన్ని నిషేధించినట్లు బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మీడియాకు చెప్పారు.

IPL 2015 Daily Guide: Match 30 - Kolkata Knight Riders Vs Chennai Super Kings


ఎవరెవరు ఆడుతున్నారు?
కోల్‌కత్తా నైట్ రైడర్స్ Vs చెన్నై సూపర్ కింగ్స్


ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయానికి?
ఈడెన్ గార్డెన్స్, కోల్‌కత్తా
ఏప్రిల్ 30 (గురువారం)
సాయంత్రం 8 గంటలకు


భారత్‌లో ఏ టీవి ప్రసారం చేస్తోంది?
సోనీ మ్యాక్స్ (హిందీ కామెంటరీ)
సోనీ సిక్స్ (ఇంగ్లీషు)
సోనీ ఆత్ (బెంగాలీ)
సోనీ కిక్స్ (తమిళం, తెలుగు)


కీలక ఆటగాళ్లు?
కోల్‌కత్తా నైట్ రైడర్స్ - గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్, ఆండ్రీ రస్సెల్, మోర్నీ మోర్కెల్, ఉమేష్ యాదవ్
చెన్నై సూపర్ కింగ్స్ - బ్రెండన్ మెక్ కల్లమ్, డ్వేన్ స్మిత్, సురేష్ రైనా, ధోని, ఆశిష్ నెహ్రా


రికార్డు
చెన్నై సూపర్ కింగ్స్ - 10
కోల్‌కత్తా నైట్ రైడర్స్ - 5


పాయింట్ల పట్టికలో ప్రస్తుత స్ధానం
చెన్నై సూపర్ కింగ్స్ - నెంబర్. 1 (6 గెలుపు, 1 ఓటమి)
కోల్‌కత్తా నైట్ రైడర్స్ - నెంబర్. 4 (3 గెలుపు, 3 ఓటమి, 1 ఫలితం తేలలేదు)


జట్లు

కోలకతా నైట్ రైడర్స్: గౌతమ్ గంభీర్ (కెప్టెన్), సునీల్ నారీన్, రాబిన్ ఉతప్ప (వికెట్ కీపర్), పియూష్ చావ్లా, యూసుఫ్ పఠాన్, షాకిబ్ అల్ హసన్, మోర్న్ మోర్కెల్, ఉమేష్ యాదవ్, మనీష్ పాండే, పాట్ కమ్మిన్స్, ర్యాన్ టెన్ డోషేట్, సూర్యకుమార్ యాదవ్, ఆండ్రీ రస్సెల్ వీర ప్రతాప్ సింగ్, కులదీప్ యాదవ్, బ్రాడ్ హాగ్, సుమిత్ నర్వాల్, షెల్డన్ జాక్సన్, ఆదిత్య గర్హ్వాల్, కేసీ కరియప్ప, వైభవ్ రావల్, అజర్ మహమూద్, జోహాన్ బోథా

చెన్నై సూపర్ కింగ్స్: ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మోహిత్ శర్మ, బ్రెండన్ మెక్కలమ్, డ్వేన్ బ్రేవో, డ్వేన్ స్మిత్, ఫాఫ్ డు ప్లెసిస్, మాట్ హెన్రీ, శామ్యూల్ బద్రీ, మైఖేల్ హస్సీ, కైల్ అబోట్, ఆండ్రూ టై, పవన్ నెగి, ఆశిష్ నెహ్రా, బాబా అపరాజిత్, ఈశ్వర్ పాండే, మిథున్ మన్హాస్, మరింత రోనిత్, రాహుల్ శర్మ, అంకుశ్ బైన్స్ ఇర్ఫాన్ పతాన్, ప్రత్యూష్ సింగ్, ఏకలవ్య ద్వివేది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+