Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ డైలీ గైడ్: మ్యాచ్ 29 - గ్రీన్ సిటీలో బెంగుళూరు Vs రాజస్ధాన్

బెంగుళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ఈరోజు బెంగుళూరులో సాయంత్రం 8 గంటలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు Vs రాజస్ధాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. వరుసగా రెండు విజయాలను సొంతం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు సొంత మైదానంలో ఈ మ్యాచ్ జరగనుండటంతో హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది.

ఏప్రిల్ 24న అహ్మాదాబాద్‌లోని సర్ధార్ పటేల్ స్డేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు Vs రాజస్ధాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్ధాన్‌పై బెంగుళూరు 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో డేర్ డెవిల్స్‌పై 10 వికెట్ల తేడాతో బెంగుళూరు విజయం సాధించింది.

గత 3 మ్యాచ్‌లుగా రాజస్ధాన్ రాయల్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలవ్వగా, కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఐపీఎల్ టోర్నమెంట్‌లో ఆడిన తొలి ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఒకే ఒక జట్టు రాజస్ధాన్ రాయల్స్ మాత్రమే.

ఎవరెవరు ఆడుతున్నారు?
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు Vs రాజస్థాన్ రాయల్స్

IPL 2015 Daily Guide: Match 29 - Royal Challengers Bangalore Vs Rajasthan Royals

ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయానికి?
చిన్నసామి స్డేడియం, బెంగుళూరు
ఏప్రిల్ 28 (బుధవారం)
సాయంత్రం 8 గంటలకు

భారత్‌లో ఏ టీవి ప్రసారం చేస్తోంది?
సోనీ మ్యాక్స్ (హిందీ కామెంటరీ)
సోనీ సిక్స్ (ఇంగ్లీషు)
సోనీ ఆత్ (బెంగాలీ)
సోనీ కిక్స్ (తమిళం, తెలుగు)

కీలక ఆటగాళ్లు?
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డెవిలియర్స్, మిచెల్ స్టార్క్
రాజస్థాన్ రాయల్స్ - అజ్యెంక రహానే, షేన్ వాట్సన్, స్టీవ్ స్మిత్, జేమ్స్ ఫల్కనర్, ప్రవీణ్ తాంబే

రికార్డు
రాజస్థాన్ రాయల్స్ - 7
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - 7

పాయింట్ల పట్టికలో ప్రస్తుత స్ధానం
రాజస్థాన్ రాయల్స్ - నెంబర్. 2 (5 గెలుపు, 2 ఓటమి, 1 రద్దు)
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - నెంబర్. 4 (3 గెలుపు, 3 ఓటమి)

జట్లు

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఎబి డి విలియర్స్, క్రిస్ గేల్, మిచెల్ స్టార్క్, నిక్ మాడిన్సన్, వరుణ్ ఆరోన్, అశోక్ దిండా, హర్షల్ పటేల్, విజయ్ జోల్, అబూ నెచిమ్, సందీప్ వారియర్, యోగేష్ టకావాలే, యుజ్వేంద్ర చాహల్, రిలీ రొస్సో, ఇక్బాల్ అబ్దుల్లా, మన్వీందర్ బిస్లా, మన్దీప్ సింగ్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సుబ్రమణ్యం బద్రీనాథ్, డారెన్ సామీ, సీన్ అబోట్, డేవిడ్ వైసే, సర్ఫరాజ్ ఖాన్, జలజ్ సక్సేనా, శిశిర్ భవానే, శ్రీనాథ్ అరవింద్.

రాజస్థాన్ రాయల్స్: షేన్ వాట్సన్ (కెప్టెన్), స్టువర్ట్ బిన్నీ, జేమ్స్ ఫాల్క్నర్, అజింక్య రహానే, సంజూ శామ్సన్ (వికెట్ కీపర్), స్టీవ్ స్మిత్, రజత్ భాటియా, టిమ్ సౌథీ, ధవళ్ కులకర్ణి, అభిషేక్ నాయర్, కేన్ రిచర్డ్సన్, బెన్ కట్టింగ్, కరుణ్ నాయర్, దీపక్ హుడా , దిశాంత్ యాగ్నిక్, విక్రమ్జీత్ మాలిక్, అంకిత్ శర్మ, రాహుల్ తెవాతియాతోపాటు తంబె, క్రిస్ మోరిస్, దినేష్ సలుంఖే, జువాన్ థెరాన్, ప్రదీప్ సాహు, బరిందర్ శరణ్, సాగర్ త్రివేది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+