Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ డైలీ గైడ్: మ్యాచ్ 28 - చెన్నైలో చెన్నైతో కోల్‌కత్తా ఢీ

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాయింట్ల పట్టికలో నెంబర్ 2 Vs నెంబర్ 3గా ఉన్న జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు చెన్నైలోని ఎమ్ చిదంబరం స్డేడియంలో జరగనుంది. పాయింట్ల పట్టికలో నెంబర్ 2 స్ధానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, మూడో స్ధానంలో ఉన్న కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో తలపడుతుంది.

ఐపీఎల్ మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. సమిష్టిగా ముందుకు దూసుకుపోతుంది. ఇక చెన్నై పేసర్ అశిష్ నెహ్రూ అధ్బుతమైన ఫామ్‌తో జట్టుకి కీలక విజయాలనందిస్తున్నాడు.

ఈరోజు జరగనున్న మ్యాచ్‌లో కోల్‌కత్తా బ్యాట్స్ మెన్లు చెన్నై పేసర్ ఆశిష్ నెహ్రాని నిలవరిస్తారో లేదో చూడాలి. చెన్నైలో ఈ మ్యాచ్ జరుగుతుండటంతో చెన్నై మ్యాచ్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది.

Chennai Super Kings Vs Kolkata Knight Riders

ఎవరెవరు ఆడుతున్నారు?
చెన్నై సూపర్ కింగ్స్ Vs కోల్‌కత్తా నైట్ రైడర్స్

ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయానికి?
ఎమ్ చిదంబరం స్టేడియం, చెన్నై
ఏప్రిల్ 27 (మంగళవారం)
సాయంత్రం 8 గంటలకు

భారత్‌లో ఏ టీవి ప్రసారం చేస్తోంది?
సోనీ మ్యాక్స్ (హిందీ కామెంటరీ)
సోనీ సిక్స్ (ఇంగ్లీషు)
సోనీ ఆత్ (బెంగాలీ)
సోనీ కిక్స్ (తమిళం, తెలుగు)

కీలక ఆటగాళ్లు?
చెన్నై సూపర్ కింగ్స్ - బ్రెండన్ మెక్ కల్లమ్, డ్వేన్ స్మిత్, సురేష్ రైనా, ధోని, ఆశిష్ నెహ్రా
కోల్‌కత్తా నైట్ రైడర్స్ - గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్, ఆండ్రీ రస్సెల్, మోర్నీ మోర్కెల్, ఉమేష్ యాదవ్

రికార్డు
చెన్నై సూపర్ కింగ్స్ - 9
కోల్‌కత్తా నైట్ రైడర్స్ - 5

పాయింట్ల పట్టికలో ప్రస్తుత స్ధానం
చెన్నై సూపర్ కింగ్స్ - నెంబర్. 2 (5 గెలుపు, 1 ఓటమి)
కోల్‌కత్తా నైట్ రైడర్స్ - నెంబర్. 3 (3 గెలుపు, 2 ఓటమి, 1 ఫలితం తేలలేదు)

జట్లు

కోలకతా నైట్ రైడర్స్: గౌతమ్ గంభీర్ (కెప్టెన్), సునీల్ నారీన్, రాబిన్ ఉతప్ప (వికెట్ కీపర్), పియూష్ చావ్లా, యూసుఫ్ పఠాన్, షాకిబ్ అల్ హసన్, మోర్న్ మోర్కెల్, ఉమేష్ యాదవ్, మనీష్ పాండే, పాట్ కమ్మిన్స్, ర్యాన్ టెన్ డోషేట్, సూర్యకుమార్ యాదవ్, ఆండ్రీ రస్సెల్ వీర ప్రతాప్ సింగ్, కులదీప్ యాదవ్, బ్రాడ్ హాగ్, సుమిత్ నర్వాల్, షెల్డన్ జాక్సన్, ఆదిత్య గర్హ్వాల్, కేసీ కరియప్ప, వైభవ్ రావల్, అజర్ మహమూద్, జోహాన్ బోథా

చెన్నై సూపర్ కింగ్స్: ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మోహిత్ శర్మ, బ్రెండన్ మెక్కలమ్, డ్వేన్ బ్రేవో, డ్వేన్ స్మిత్, ఫాఫ్ డు ప్లెసిస్, మాట్ హెన్రీ, శామ్యూల్ బద్రీ, మైఖేల్ హస్సీ, కైల్ అబోట్, ఆండ్రూ టై, పవన్ నెగి, ఆశిష్ నెహ్రా, బాబా అపరాజిత్, ఈశ్వర్ పాండే, మిథున్ మన్హాస్, మరింత రోనిత్, రాహుల్ శర్మ, అంకుశ్ బైన్స్ ఇర్ఫాన్ పతాన్, ప్రత్యూష్ సింగ్, ఏకలవ్య ద్వివేది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+