అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)8 లో భాగంగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు Vs రాజస్ధాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కి అహ్మదాబాద్‌లోని సర్ధార్ పటేల్ స్టేడియం ఆతిథ్యం ఇస్తుంది. ఐపీఎల్ టోర్నమెంట్‌లో ఇప్పటి వరకు సరైన ప్రదర్శన కనబర్చని రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఈ మ్యాచ్‌ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
గత వరుస మూడు మ్యాచ్‌లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పరాజయాలు పలకరిస్తూనే ఉన్నాయి. ఏప్రిల్ 22న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ ఆడని విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
వరుసగా ఐదు విజయాలను నమోదు చేసిన రాజస్ధాన్ రాయల్స్ జట్టుకి సూపర్ ఓవర్‌తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్రేక్ వేసింది. అయినా పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతూనే ఉంది. షేన్ వాట్సన్ నేతృత్వంలోని రాజస్ధాన్ రాయల్స్ ఈ మ్యాచ్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది.

ఎవరెవరు ఆడుతున్నారు?
రాజస్థాన్ రాయల్స్ Vs రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు
ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయానికి?
సర్ధార్ పటేల్ స్డేడియం, అహ్మదాబాద్
ఏప్రిల్ 24 (శుక్రవారం)
సాయంత్రం 8 గంటలకు
భారత్‌లో ఏ టీవి ప్రసారం చేస్తోంది?
సోనీ మ్యాక్స్ (హిందీ కామెంటరీ)
సోనీ సిక్స్ (ఇంగ్లీషు)
సోనీ ఆత్ (బెంగాలీ)
సోనీ కిక్స్ (తమిళం, తెలుగు)
కీలక ఆటగాళ్లు?
రాజస్థాన్ రాయల్స్ - అజ్యెంక రహానే (ఆరెంజ్ క్యాప్‌ని సొంతం చేసుకున్నాడు), షేన్ వాట్సన్, స్టీవ్ స్మిత్, జేమ్స్ ఫల్కనర్, ప్రవీణ్ తాంబే
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డెవిలియర్స్, మిచెల్ స్టార్క్
రికార్డు
రాజస్థాన్ రాయల్స్ - 7
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - 6
పాయింట్ల పట్టికలో ప్రస్తుత స్ధానం
రాజస్థాన్ రాయల్స్ - నెంబర్. 1 (5 గెలుపు, 1 ఓటమి)
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - నెంబర్. 7 (1 గెలుపు, 3 ఓటమి)
జట్లు
రాజస్థాన్ రాయల్స్: షేన్ వాట్సన్ (కెప్టెన్), స్టువర్ట్ బిన్నీ, జేమ్స్ ఫాల్క్నర్, అజింక్య రహానే, సంజూ శామ్సన్ (వికెట్ కీపర్), స్టీవ్ స్మిత్, రజత్ భాటియా, టిమ్ సౌథీ, ధవళ్ కులకర్ణి, అభిషేక్ నాయర్, కేన్ రిచర్డ్సన్, బెన్ కట్టింగ్, కరుణ్ నాయర్, దీపక్ హుడా , దిశాంత్ యాగ్నిక్, విక్రమ్జీత్ మాలిక్, అంకిత్ శర్మ, రాహుల్ తెవాతియాతోపాటు తంబె, క్రిస్ మోరిస్, దినేష్ సలుంఖే, జువాన్ థెరాన్, ప్రదీప్ సాహు, బరిందర్ శరణ్, సాగర్ త్రివేది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఎబి డి విలియర్స్, క్రిస్ గేల్, మిచెల్ స్టార్క్, నిక్ మాడిన్సన్, వరుణ్ ఆరోన్, అశోక్ దిండా, హర్షల్ పటేల్, విజయ్ జోల్, అబూ నెచిమ్, సందీప్ వారియర్, యోగేష్ టకావాలే, యుజ్వేంద్ర చాహల్, రిలీ రొస్సో, ఇక్బాల్ అబ్దుల్లా, మన్వీందర్ బిస్లా, మన్దీప్ సింగ్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సుబ్రమణ్యం బద్రీనాథ్, డారెన్ సామీ, సీన్ అబోట్, డేవిడ్ వైసే, సర్ఫరాజ్ ఖాన్, జలజ్ సక్సేనా, శిశిర్ భవానే, శ్రీనాథ్ అరవింద్.