న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 8లో భాగంగా ఈరోజు ఢిల్లీ డేర్ డెవిల్స్ Vs ముంబై ఇండియన్స్‌కు మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీ డేర్ డెవిల్స్ సొంత మైదానం ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరగనుంది. దీంతో ఎలాగైనా సరే అభిమానుల మద్దతు తమకే ఉంటుంది కాబట్టి మ్యాచ్‌లో విజయం సాధిస్తామనే ధీమాతో ఉంది.
ఐపీఎల్‌లో ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు మంచి రికార్డు ఉంది. గతంలో ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఢిల్లీదే విజయం. అయితే ఐపీఎల్‌లో ఢిల్లీ రికార్డు మాత్రం అధ్వాన్నంగా ఉంది. ఇప్పటి వరకు ఆడిన ఐపీఎల్ మ్యాచ్‌ల్లో కేవలం 14 మ్యాచ్‌ల్లో గెలుపొంది, 26 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది.
అయితే ఈ ఐపీఎల్‌లో ఢిల్లీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో కూడా పరాజయం పాలైంది. సొంత మైదానంలో ఢిల్లీ మళ్లీ విజయం సాధించాలంటే ఓ గొప్ప ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఈ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన కూడా ఏమంత అధ్భుతంగా లేదు.
ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్‌లోనే గెలుపొంది, మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసింది. దీంతో ముంబై కూడా ఎలగైనా సరే ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలనే భారీ ప్రణాళికలను రచిస్తోంది.

ఎవరెవరు ఆడుతున్నారు?
ఢిల్లీ డేర్ డెవిల్స్ Vs ముంబై ఇండియన్స్
ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయానికి?
ఫిరోజ్ షా కోట్లా మైదానం, న్యూఢిల్లీ
ఏప్రిల్ 23 (గురువారం)
సాయంత్రం 8 గంటలకు
భారత్‌లో ఏ టీవి ప్రసారం చేస్తోంది?
సోనీ మ్యాక్స్ (హిందీ కామెంటరీ)
సోనీ సిక్స్ (ఇంగ్లీషు)
సోనీ ఆత్ (బెంగాలీ)
సోనీ కిక్స్ (తమిళం, తెలుగు)
కీలక ఆటగాళ్లు?
ఢిల్లీ డేర్ డెవిల్స్ - జేపీ డుమిని, శ్రేయాస్ అయ్యర్, యువరాజ్ సింగ్, ఇమ్రాన్ తాహిర్
ముంబై ఇండియన్స్ - రోహీత్ శర్మ, కీరన్ పోలార్డ్, హర్భజన్ సింగ్, లతిష్ మలింగ
ఈరోజు నివేదికల ప్రకారం ముంబై ఆల్ రౌండర్ కోరీ ఆండర్సన్ ఐపీఎల్ టోర్నమెంట్ నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది.
రికార్డు
ఢిల్లీ డేర్ డెవిల్స్ - 7
ముంబై ఇండియన్స్ - 7
పాయింట్ల పట్టికలో ప్రస్తుత స్ధానం
ఢిల్లీ డేర్ డెవిల్స్ - నెంబర్. 5 (2 గెలుపు, 3 ఓటమి)
ముంబై ఇండియన్స్ - నెంబర్. 7 (1 గెలుపు, 4 ఓటమి)
జట్లు
ఢిల్లీ డేర్డెవిల్స్: జేపీ డుమినీ (కెప్టెన్), మహ్మద్ షమీ, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), మనోజ్ తివారీ, కేదార్ జాదవ్ (వికెట్ కీపర్), మయాంక్ అగర్వాల్, షాబాజ్ నదీమ్, సౌరభ్ తివారీ, జయంత్ యాదవ్, ఇమ్రాన్ తాహిర్, నాథన్ కౌల్టర్ నైల్, ఏంజెలో మాథ్యూస్ యువరాజ్ సింగ్, అమిత్ మిశ్రా, జైదేవ్, గురిందర్ సంధు, శ్రేయాస్ అయ్యర్, గౌతం, ట్రావిస్ హెడ్, శ్రీకర్ భరత్, అల్బీ మోర్కెల్, మార్కస్ స్టోయిన్స్, జహీర్ ఖాన్, కేకే జియాస్, డొమినిక్ జోసెఫ్.
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), లసిత్ మలింగ, కీరాన్ పొల్లార్డ్, అంబటి రాయుడు (వికెట్కీపర్), హర్భజన్ సింగ్, కోరీ ఆండర్సన్, ఆదిత్య తారే, జస్ప్రీత్ బుంమ్రా, జోష్ హాజల్‌ఉడ్, మార్చాంట్లు డి లాంగే పవన్ సుయాల్, శ్రేయాస్ గోపాల్, లెండిల్ సిమన్స్, ఆరోన్ ఫించ్, ప్రజ్ఞాన్ ఓజా, మిఛెల్ మెక్‌గ్లాన్, అభిమన్యు మిథున్, ఐడెన్ మంచు తుఫాను, అక్షయ్, నితీష్ రానా, సిద్దేశ్ లాడ్, హ్యాడ్రిక్ పాండ్య, జగదీష్ సుజిత్, ఉన్ముక్త్ చంద్, వినయ్ కుమార్, పార్థివ్ పటేల్ (వికెట్ కీపర్).