Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2015 డైలీ గైడ్: విశాఖలో హైదరాబాద్ Vs కోల్‌కత్తా

విశాఖపట్నం: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు విశాఖపట్నంలో సన్ రైజర్స్ హైదరాబాద్ Vs కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కు మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఫేవరేట్‌గా కోల్‌కత్తా బరిలోకి దిగుతుంది.

కోల్‌కత్తా వరుసగా రెండు విజయాలతో టోర్నమెంట్లో దూసుకెళ్తుంగా, సన్ రైజర్స్ ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓటమి చెందగా, కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించింది. దీంతో హైదరాబాద్ సొంత మైదానం విశాఖపట్నంలో ఈ మ్యాచ్ జరుగుతుండటంతో ఎలాగైనా సరే విజయాన్ని నమోదు చేయాలనే కసితో హైదరాబాద్ జట్టు ఉంది.

ఈ ఐపీఎల్‌లో ఢిపెంఢింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన కోల్‌కత్తా ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు మ్యాచ్‌ల్లో లక్ష్య ఛేదనను సునాయసంగా చేధించింది. ఒక్క బెంగుళూరుతో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే ఓటమి పాలైంది. ఈరోజు జరిగే మ్యాచ్‌లో కోల్‌కత్తా విజయం సాధిస్తే పాయిట్ల పట్టికలో రెండో స్ధానానికి ఎగబాకుతుంది.

IPL 2015 Daily Guide: Match 19 - Sunrisers Hyderabad Vs Kolkata Knight Riders

ఎవరెవరు ఆడుతున్నారు?
సన్ రైజర్స్ హైదరాబాద్ Vs కోల్‌కత్తా నైట్ రైడర్స్


ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయానికి?
ఏసీఏ-వీడీసీఏ స్టేడియం, విశాఖపట్నం
ఏప్రిల్ 22 (బుధవారం)
సాయంత్రం 4 గంటలకు


భారత్‌లో ఏ టీవి ప్రసారం చేస్తోంది?
సోనీ మ్యాక్స్ (హిందీ కామెంటరీ)
సోనీ సిక్స్ (ఇంగ్లీషు)
సోనీ ఆత్ (బెంగాలీ)
సోనీ కిక్స్ (తమిళం, తెలుగు)


కీలక ఆటగాళ్లు?
సన్ రైజర్స్ హైదరాబాద్ - డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, డేల్ స్టెయిన్, భువనేశ్వర్ కుమార్
కోల్‌కత్తా నైట్ రైడర్స్ - గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్, ఆండ్రీ రస్సెల్, ఉమేష్ యాదవ్

ఈ ఐపీఎల్‌లో గౌతమ్ గంభీర్ నాలుగు ఇన్నింగ్స్‌లో మూడు అర్ధ సెంచీలు సాధించాడు.


రికార్డు
సన్ రైజర్స్ హైదరాబాద్ - 3
కోల్‌కత్తా నైట్ రైడర్స్ - 1


పాయింట్ల పట్టికలో ప్రస్తుత స్ధానం
సన్ రైజర్స్ హైదరాబాద్ - నెంబర్. 3 (3 గెలుపు, 1 ఓటమి)
కోల్‌కత్తా నైట్ రైడర్స్ - నెంబర్. 6 (1 గెలుపు, 3 ఓటమి)


జట్లు

సన్ రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), శిఖర్ ధావన్, డేల్ స్టెయిన్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, మోజెస్ హెన్రిక్స్, కేఎల్ రాహుల్, పర్వేజ్ రసూల్, నమన్ ఓజా (వికెట్ కీపర్), ఆశిష్ రెడ్డి, రికీభువి, ఛమా మిలింద్, కర్ణ్ శర్మ, కేన్ విలియమ్సన్ కెవిన్ పీటర్సన్, ఇయాన్ మోర్గాన్, రవి బొపారా, ట్రెంట్ బౌల్ట్, ప్రవీణ్ కుమార్, విహారి, ప్రశాంత్ పద్మనాభన్, సిద్దార్థ్ కౌల్, బిపుల్ శర్మ

కోలకతా నైట్ రైడర్స్: గౌతమ్ గంభీర్ (కెప్టెన్), సునీల్ నారీన్, రాబిన్ ఉతప్ప (వికెట్ కీపర్), పియూష్ చావ్లా, యూసుఫ్ పఠాన్, షాకిబ్ అల్ హసన్, మోర్న్ మోర్కెల్, ఉమేష్ యాదవ్, మనీష్ పాండే, పాట్ కమ్మిన్స్, ర్యాన్ టెన్ డోషేట్, సూర్యకుమార్ యాదవ్, ఆండ్రీ రస్సెల్ వీర ప్రతాప్ సింగ్, కులదీప్ యాదవ్, బ్రాడ్ హాగ్, సుమిత్ నర్వాల్, షెల్డన్ జాక్సన్, ఆదిత్య గర్హ్వాల్, కేసీ కరియప్ప, వైభవ్ రావల్, అజర్ మహమూద్, జోహాన్ బోథా

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+