Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2015 డైలీ గైడ్: మ్యాచ్ - 18: అహ్మదాబాద్‌లో రాజస్ధాన్ Vs పంజాబ్

అహ్మాదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఈరోజు వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్ధాన్ రాయల్స్‌తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడునుంది. ఈ మ్యాచ్ అహ్మాదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్డేడియంలో జరగనుంది. గత ఏడాది ఐపీఎల్ ఫైనలిస్ట్ అయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఈ ఏడాది ఏమంత అద్భుతమైన ప్రదర్శనను కనబర్చడం లేదు.

ఇప్పటికే ఐదు విజయాలతో టోర్నమెంట్లోనే టాప్ స్ధానంలో ఉన్న రాజస్ధాన్‌పై విజయం సాధించడం పంజాబ్‌కు కష్టంతో కూడుకున్న పనే. రాజస్ధాన్ జట్టు ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్తుండగా కోల్‌క్తతా జట్టు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓటమి పాలై, కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది.

IPL 2015 Daily Guide: Match 18 - Rajasthan Royals Vs Kings XI Punjab

ఎవరెవరు ఆడుతున్నారు?
రాజస్ధాన్ రాయల్స్ Vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్


ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయానికి?
సర్ధార్ పటేల్ స్టేడియం, అహ్మాదాబాద్
ఏప్రిల్ 21 (మంగళవారం)
సాయంత్రం 8 గంటలకు


భారత్‌లో ఏ టీవి ప్రసారం చేస్తోంది?
సోనీ మ్యాక్స్ (హిందీ కామెంటరీ)
సోనీ సిక్స్ (ఇంగ్లీషు)
సోనీ ఆత్ (బెంగాలీ)
సోనీ కిక్స్ (తమిళం, తెలుగు)


కీలక ఆటగాళ్లు?
రాజస్ధాన్ రాయల్స్ - అజ్యెంక రహానే, షేన్ వాట్సన్, స్టీవ్ స్మిత్, ప్రవీణ్ తాంబే, జేమ్స్ ఫల్కనర్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ - జార్జి బెయిలీ, గ్లెన్ మ్యాక్సెవెల్, సందీప్ శర్మ, మిచెల్ జాన్సన్

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు విజయం సాధించాలంటే మ్యాక్స్‌వెల్ విజృంభించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌ల్లో మ్యాక్స్‌వెల్ ఏమంత దూకుడుగా ఆడలేదు. నాలుగు ఇన్నింగ్స్‌లో 61 పరుగులు మాత్రమే చేశాడు. గత ఏడాది జరిగిన ఐపీఎల్‌లో మ్యాక్స్‌వెల్ విజృంభణతోటే పంజాబ్ ఫైనల్‌కు చేరింది.


రికార్డు
రాజస్ధాన్ రాయల్స్ - 9
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ - 5


పాయింట్ల పట్టికలో ప్రస్తుత స్ధానం
రాజస్ధాన్ రాయల్స్ - నెంబర్. 1 (5 గెలుపు, 0 ఓటమి)
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ - నెంబర్. 6 (1 గెలుపు, 3 ఓటమి)


జట్లు

రాజస్థాన్ రాయల్స్: షేన్ వాట్సన్ (కెప్టెన్), స్టువర్ట్ బిన్నీ, జేమ్స్ ఫాల్క్నర్, అజింక్య రహానే, సంజూ శామ్సన్ (వికెట్ కీపర్), స్టీవ్ స్మిత్, రజత్ భాటియా, టిమ్ సౌథీ, ధవళ్ కులకర్ణి, అభిషేక్ నాయర్, కేన్ రిచర్డ్సన్, బెన్ కట్టింగ్, కరుణ్ నాయర్, దీపక్ హుడా , దిశాంత్ యాగ్నిక్, విక్రమ్జీత్ మాలిక్, అంకిత్ శర్మ, రాహుల్ తెవాతియాతోపాటు తంబె, క్రిస్ మోరిస్, దినేష్ సలుంఖే, జువాన్ థెరాన్, ప్రదీప్ సాహు, బరిందర్ శరణ్, సాగర్ త్రివేది.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్: జార్జ్ బెయిలీ (కెప్టెన్), అక్షర పటేల్, అనురీత్ సింగ్, బీరున్ హెన్డ్రిక్స్, డేవిడ్ మిల్లర్, గ్లెన్ మాక్స్వెల్, గుర్కీత్ మన్ సింగ్, కర్ణ్వీర్ సింగ్, మనన్ వోరా, మిచెల్ జాన్సన్, పర్వీందర్ ఆవానా, రిషి ధావన్, సందీప్ శర్మ, ఠాకూర్, షాన్ మార్ష్, శివం శర్మ, తిసర పెరెరా, వీరేంద్ర సెహ్వాగ్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), మురళీ విజయ్, నిఖిల్ నాయక్, యోగేష్ గోల్వాల్కర్.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+