Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ డైలీగైడ్: ఎలిమినేటర్ - క్వాలిఫయిర్ 2కు అర్హత సాధించేదేవరో?

పూణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 8వ ఎడిషన్‌లో ఎలిమినేటర్‌లో భాగంగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, రాజస్ధాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు క్వాలిఫయిర్ 2లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతుంది.

ఓడిన జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ రోజు జరగనున్న మ్యాచ్‌లో టైటిల్ ఫేవరేట్‌గా విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ జట్టు కనిపిస్తోంది. ఇటీవల మ్యాచ్‌ల్లో వరుస విజయాలతో బంగుళూరు దూసుకుపోతుంది.

అయితే ఈరోజు మ్యాచ్ జరగబోయే మైదానంలో ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా బెంగుళూరు ఆడకపోవడం విశేషం. రాజస్ధాన్ రాయల్స్ ఇప్పటికే ఈ మైదానంలో ఒక్క మ్యాచ్ ఆడి విజయం సాధించింది. లీగ్ దశలో రాజస్ధాన్ రాయల్స్ ఆడిన చివరి మ్యాచ్‌లో షేన్ వాట్సన్ సెంచరీతో చెలరేగిపోయాడు.

అదే ఫామ్‌ని ఈరోజు కూడా కొనసాగిస్తాడని అభిమానులు ఆరాటపడుతున్నారు. రాజస్ధాన్ రాయల్స్ జట్టులో మరో ఇద్దరు కీలక ఆటగాళ్లు అజ్యంకె రహానే, స్టీవ్ స్మిత్. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు రాజస్ధాన్, బెంగుళూరు మధ్య 15 మ్యాచ్‌లు జరిగాయి. అందులో ఏడు మ్యాచ్‌ల్లో బెంగుళూరు గెలిస్తే, మిగతా ఏడు మ్యాచ్‌ల్లో రాజస్ధాన్ గెలిచింది. ఈ సీజన్‌లో రెండు జట్లు సాధించిన పాయింట్లు (16) కూడా సమం.

 IPL 2015 Daily Guide: Eliminator (Match 58) - Royal Challengers Bangalore Vs Rajasthan Royals

ఎవరెవరు ఆడుతున్నారు?
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు Vs రాజస్ధాన్ రాయల్స్


ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయానికి?
ఎమ్‌సీఏ అంతర్జాతీయ స్డేడియం, బెంగుళూరు
మే 20 (బుధవారం)
సాయంత్రం 8 గంటలకు


భారత్‌లో ఏ టీవి ప్రసారం చేస్తోంది?
సోనీ మ్యాక్స్ (హిందీ కామెంటరీ)
సోనీ సిక్స్ (ఇంగ్లీషు)
సోనీ ఆత్ (బెంగాలీ)
సోనీ కిక్స్ (తమిళం, తెలుగు)


కీలక ఆటగాళ్లు?
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డెవిలియర్స్, మిచెల్ స్టార్క్
రాజస్ధాన్ రాయల్స్ - షేన్ వాట్సన్, స్టీవ్ స్మిత్, అజ్యంకే రహానే, జేమ్స్ ఫల్కనర్


రికార్డు
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - 7
రాజస్ధాన్ రాయల్స్ - 7


ఈ సీజన్‌లో
రాజస్ధాన్ రాయల్స్ - 1
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - 0

బెంగుళూరులో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.


జట్లు

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఎబి డి విలియర్స్, క్రిస్ గేల్, మిచెల్ స్టార్క్, నిక్ మాడిన్సన్, వరుణ్ ఆరోన్, అశోక్ దిండా, హర్షల్ పటేల్, విజయ్ జోల్, అబూ నెచిమ్, సందీప్ వారియర్, యోగేష్ టకావాలే, యుజ్వేంద్ర చాహల్, రిలీ రొస్సో, ఇక్బాల్ అబ్దుల్లా, మన్వీందర్ బిస్లా, మన్దీప్ సింగ్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సుబ్రమణ్యం బద్రీనాథ్, డారెన్ సామీ, సీన్ అబోట్, డేవిడ్ వైసే, సర్ఫరాజ్ ఖాన్, జలజ్ సక్సేనా, శిశిర్ భవానే, శ్రీనాథ్ అరవింద్.

రాజస్థాన్ రాయల్స్: షేన్ వాట్సన్ (కెప్టెన్), స్టువర్ట్ బిన్నీ, జేమ్స్ ఫాల్క్నర్, అజింక్య రహానే, సంజూ శామ్సన్ (వికెట్ కీపర్), స్టీవ్ స్మిత్, రజత్ భాటియా, టిమ్ సౌథీ, ధవళ్ కులకర్ణి, అభిషేక్ నాయర్, కేన్ రిచర్డ్సన్, బెన్ కట్టింగ్, కరుణ్ నాయర్, దీపక్ హుడా , దిశాంత్ యాగ్నిక్, విక్రమ్జీత్ మాలిక్, అంకిత్ శర్మ, రాహుల్ తెవాతియాతోపాటు తంబె, క్రిస్ మోరిస్, దినేష్ సలుంఖే, జువాన్ థెరాన్, ప్రదీప్ సాహు, బరిందర్ శరణ్, సాగర్ త్రివేది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+