Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ సేన ఔట్: ఫైనల్లోకి ధోనీ సేన, ఉత్కంఠ మ్యాచులో గెలుపు

రాంచీ: చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఒక్క బంతి మాత్రమే మిగిలి ఉన్న స్థితిలో చెన్నై అతి కష్టం మీద విజయం సాధించింది. చివరి రెండు బంతుల్లో ఒక్క పరుగు చేయాల్సిన స్థితిలో అశ్విన్ వచ్చీరాగానే ఓ పరుగు తీయడంతో ఒక్క బంతి మిగిలి ఉండగానే చెన్నై విజయం సాధించింది. దీంతో చెన్నై ఫైనల్‌ల్లో అడుగు పెట్టింది.

ఫైనల్ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్‌ను ఎదుర్కోనుంది. ఏడు వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో చెన్నై 140 పరుగులు చేసింది. అంతకు ముందు బెంగళూర్ 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. రాయల్ చాలెంజర్స్ బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు తీసుకోగా, స్టార్క్, అరవింద్, హర్షల్ పటేల్, వీస్ తలో వికెట్ తీసుకున్నారు.

చెన్నై చివరి రెండు ఓవర్లలో 13 పరుగులు చేయాల్సిన స్థితిలో పడింది. మరో ఆరు వికెట్లు చేతిలో ఉన్నాయి. పవన్ నేగి, ధోనీ క్రీజులో ఉన్నారు. ధోనీ 18 ఓవరు మొదటి బంతిని బౌండరీ దాటించాడు. దాంతో 11 బంతుల్లో 9 పరుగులు చేస్తే విజయం చెన్నైని వరిస్తుంది. తర్వాతి బంతికి రన్నవుట్ మిస్సయింది. పది బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన అవసరం చెన్నైకి ఏర్పడింది. తర్వాతి బంతికి నేగీ ఒక్క పరుగు తీశాడు. 9 బంతుల్లో 7 పరుగులు చెన్నైకి కావాలి. తర్వాతి బంతి కూడా మిస్ ఫీల్డ్ అయి చెన్నైకి రెండు పరుగులు వచ్చాయి. 8 బంతుల్లో ఐదు పరుగులు చెన్నైకి అవసరం పడ్డాయి.

ఆ తర్వాతి బంతికి నేగీ రన్నవుట్ అయ్యాడు. దీంతో చెన్నైకి 7 బంతుల్లో ఐదు పరుగులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఒక్కసారిగా మ్యాచ్ మలుపు తిరిగినట్లు అనిపించింది. స్టార్క్ వేసిన ఈ ఓవరు తర్వాతి బంతికి బ్రేవో డకౌట్ అయ్యాడు. దీంతో చివరి ఓవరులో చెన్నై ఐదు పరుగులు చేయాల్సిన స్థితిలో పడింది. 3 బంతుల్లో ఒక్క పరుగు చేస్తే విజయం చెన్నైని వరిస్తుంది. ఈ స్థితిలో హర్షల్ పటేల్ బౌలింగులో ధోనీ అవుటయ్యాడు. రెండు బంతుల్లో ఒక్క పరుగు చేయాల్సిన స్థితిలో చెన్నై పడింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అశ్విన్ ఒక్క పరుగు చేయడంతో చెన్నై విజయం సాధించింది. ఒక్క బంతి మాత్రమే మిగిలి ఉంది.

అంతకు ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ తన ముందు ఉంచిన 140 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ స్మిత్ వికెట్ కోల్పోయింది. దాంతో చెన్నై 21 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అరవింద్ బౌలింగ్‌లో స్మిత్ 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. చెన్నై వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 61 పరుగుల వద్ద డూ ప్లెసిస్ ఔట్ కాగా, ఆ వెంటనే సురేష్ రైనా అవుటయ్యాడు. చాహల్ బౌలింగులో రైనా సున్నా పరుగులకే వచ్చిన దారినే వెనుదిరిగాడు.

దూకుడుగానూ నిలకడగానూ ఆడుతూ వస్తున్న హస్సీ 56 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వీస్ బౌలింగులో అవుటయ్యాడు. దీంతో చెన్నై 108 పరుగులకు నాలుగో వికెట్ కోల్పోయింది.

చెన్నై సూపర్ కింగ్స్‌పై మ్యాచులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 139 పరుగులు చేసింది. ధోనీ వ్యూహం ఫలించి బెంగళూర్ టాపార్డర్ కుప్పకూలింది. కీలకమైన సమయంలో ధోనీ సురేష్ రైనాను ప్రయోగించాడు. దాంతో రైనా క్రిస్ గేల్‌ను వెనక్కి పంపించాడు. నెహ్రూ ఆదిలోనే బెంగళూర్ వెన్ను విరిచాడు. గేల్ దూకుడుగా ఆడలేకపోయాడు. విరాట్ కోహ్లీ, డీవిల్లీర్స్‌ త్వరత్వరగా అవుటయ్యారు.

ఐపియల్ పోటీల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచులో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. 25 పరుగులకే రెండు వికెట్లో కోల్పోయింది. డీవిల్లీర్స్ ఒక్క పరుగు మాత్రమే చేసి నెహ్రా బౌలింగులో వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మణదీప్ సింగ్ అశ్విన్ బౌలింగులో 36 పరుగుల వద్ద మూడో వికెట్‌గా పెవిలియన్ చేరుకున్నాడు. అతను నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. అంతకు ముందు విరాట్ కోహ్లీ 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నెహ్రా బౌలింగులో అవుటయ్యాడు.

క్రిస్ గేల్ సురేష్ రైనాకు దొరికిపోయాడు. 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సురేష్ రైనా తన బౌలింగులోనే క్యాచ్ పట్టి గేల్‌ను పెవిలియన్‌కు పంపించాడు. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 80 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను కోల్పోయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 125 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది.

Nehra

ఫైనల్ చేరుకోవడానికి అవసరమైన మ్యాచులో ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌పై శుక్రవారంనాడు ఫీల్డింగ్‌కు దిగింది. టాస్ గెలిచిన ధోనీ విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌ను బ్యాటింగ్‌కు దించింది.

CSK - RCB

తొలి క్వాలిఫైర్ మ్యాచులో ముంబై ఇండియన్స్‌పై ఓడిపోయిన చైన్నై సూపర్ కింగ్స్ అందుకు రెండో ప్రయత్నం చేసి విజయం సాధించింది. తొలి క్వాలిఫైర్ మ్యాచులో చెన్నై ముంబైపై 25 పరుగుల తేడాతో ఓడిపోయింది.

పూనేలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచులో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ రాజస్థాన్ రాయల్స్‌పై 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఫైనల్ కోసం చెన్నై, బెంగళూర్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో గెలిచిన చెన్నై జట్టు ఫైనల్‌లో ముంబై ఇండియన్స్‌పై తలపడుతుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+