Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్: ఫేస్‌బుక్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రభంజనం

చెన్నై: భారత్‌లో రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా అభిమానులు ఏయే ఐపీఎల్ జట్లకు మద్దతిస్తున్నారనే దానిపే సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ 'ఫ్యాన్‌డమ్‌' మ్యాప్‌‌ను విడుదల చేసింది. ఇందులో దేశవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఎక్కువగా అభిమానించే 8 జట్ల వివరాలను వెల్లడించింది.

ఇందులో ఎక్కువ మంది అభిమానులు తమ సొంత రాష్ట్రాల జట్టుకే మద్దతివ్వగా, ఏ జట్టు లేని రాష్ర్టాల ప్రజలు చెన్నై సూపర్‌ కింగ్స్‌‌కు ఫ్యాన్‌గా మారారు. అంతే కాదు ఫేస్‌బుక్‌లో ఎక్కువ లైక్‌లు దక్కించుకున్న జట్టుగా చెన్నై సూపర్‌ కింగ్సే కావడం గమనార్హం.

IPL 2015: Chennai Super Kings dominate on Facebook

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే దేశ రాజధాని ఢిల్లీలో చాలా మంది చెన్నై సూపర్ కింగ్స్‌నే తమ సొంత జట్టుగా భావించారట. ఢిల్లీకి సమీపంలో ఉన్న గుర్గావ్‌కు చెందిన ప్రజలు ఫేస్‌బుక్‌లో ముంబై ఇండియన్స్‌కు మద్దతుగా నిలిచారు.

ఐపీఎల్‌ 8వ ఎడిషన్ మొదలైనప్పటి నుంచి లక్షలాది మంది అభిమానులు తమ ఫేవరెట్‌ క్రికెటర్లు, టీమ్‌ల గురించి ఫేస్‌బుక్‌లో ఎక్కువగా చర్చించినట్లు ఈ ఫేస్‌బుక్ 'ఫ్యాన్‌డమ్‌' మ్యాప్‌ తెలిపింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+