Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్రేవో సంచనలన క్యాచ్‌లు, జడేజా మంత్రజాలం: చెన్నై 'సూపర్'

చెన్నై: బ్రేవ్ అద్భుతమైన క్యాచులతో, రవీంద్ర జడేజా బంతితో చేసిన మాయాజాలంతో రాజస్థాన్ రాయల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. దీంతో ప్లే ఆఫ్ బెర్త్‌ను అధికారికంగా కైవసం చేసుకున్న తొలి జట్టుగా అవతరించింది. బ్రెండన్‌ మెకల్లమ్‌ (61 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 81) అద్భుత ఇన్నింగ్స్‌కు, రవీంద్ర జడేజా (4/11) మాయాజాలం తోడవడంతో చెన్నై 12 పరుగులతో రాజస్థాన్‌ రాయల్స్‌పై విజయం సాధించింది.

ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో చెన్నై నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్లన్నీ ఆడిన రాయల్స్‌ తొమ్మిది వికెట్లకు 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. వాట్సన్‌ (28), శాంసన్‌ (26), రహానె (23), మోరిస్‌ (16 నాటౌట్‌) రాణించారు. స్టీవ్‌ స్మిత్‌ (4), కరుణ్‌ (10) నిరాశ పరిచారు. మోహిత్‌ మూడు, బ్రావో రెండు వికెట్లు తీశారు.

IPL 2015: Bravo's sensational catches & Jadeja's 4-for leave RR frustrated

మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 157 పరుగులు చేసింది. మెకల్లమ్‌తో పాటు డుప్లెసిస్‌ (29) రాణించాడు. చివర్లో బ్రావో (15 నాటౌట్‌), ధోనీ (13 నాటౌట్‌) వేగంగా ఆడారు. రైనా (3), డ్వేన్‌ స్మిత్‌ (6), నేగి (2) విఫలమయ్యారు. రాయల్స్‌ బౌలర్లలో క్రిస్‌ మోరిస్‌ (3/19) మూడు వికెట్లు పడగొట్టి చెన్నైని కట్టడి చేశాడు.

జడేజాకే 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది. ఈ విజయంతో చెన్నై మొత్తం 16 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకొని ప్లే ఆఫ్‌ బెర్తును చెన్నై ఖారారు చేసుకుంది. బ్రేవ్ అద్భుతమైన క్యాచులు అందుకున్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+